ఘోర ప్రమాదం.. 27 మంది సజీవ దహనం!

nanireddy
Updated on: 24 Dec 2018 1:23 PM IST
ఘోర ప్రమాదం.. 27 మంది సజీవ దహనం!
X

బీహార్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బస్సులో మంటలు వ్యాపించాయి. మంటల్లో చిక్కుకుని 27 మంది సజీవ దహనమయ్యారు. ప్రయాణికులతో ముజఫర్ పూర్ నుంచి న్యూ ఢిల్లీ వెళుతున్న బస్సు నేషనల్ హైవే 28 కు సమీపంలోని బెల్వా విలేజివద్ద అతివేగం కారణంగా అదుపుతప్పి కిందపడింది. ఈ క్రమంలో గ్యాస్ లీక్ అయ్యి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బస్సు డోర్లు తెరుచుకోలేదు దీంతో 27 మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతయ్యారు. కాగా ప్రమాదం గురించి తెలుసుకున్న ప్రధాని మోడీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇదిలావుంటే ఘటనస్థలిని బీహార్ హోమ్ మంత్రి మరియు, రవాణా శాఖ మంత్రులు పరిశీలించారు.

nanireddy

nanireddy

Next Story