ఇద్దరు కుమారులతో సహా తల్లి ఆత్మహత్య

nanireddy
Updated on: 24 Dec 2018 2:45 PM IST
ఇద్దరు కుమారులతో సహా తల్లి ఆత్మహత్య
X

కుటుంబ కలహాలు నేపథ్యంలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో సహా రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జనగామలో చోటుచేసుకుంది. జనగామ రెడ్డి స్ట్రీట్ కు చెందిన మాదాసు మధుకర్, మధులతకు 9 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉదయ్‌ కుమార్‌ (08), వినయ్‌(4) ఉన్నారు. మధుకర్‌ హైదరాబాద్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొంతకాలంగా మధుకర్, మధులత మధ్య గొడవలు జరుగుతున్నాయి. మధుకర్ తన భార్యను అదనపు కట్నం తెమ్మని వేధించేవాడు. దీంతో పెళ్ళైన 9 సంవత్సరాలకు అదనపు కట్నం తేవాలని భర్త అడగటాన్ని మధులత భరించలేదు. ఈ క్రమంలో ఆదివారం రాఖి సందర్బంగా తన సోదరుడికి రాఖి కట్టి వస్తానని చెప్పి తన ఇద్దరి పిల్లలను వెంట తీసుకెళ్లి వారితో సహా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తన్నారు.

nanireddy

nanireddy

Next Story