ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

nanireddy
Updated on: 24 Dec 2018 2:45 PM IST
ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
X

ఆడపిల్లలు పుట్టారని అత్తింటి వేధింపులు భరించలేక ఇద్దరు ఆడపిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. కుంటాల మండలం అంబుగామ గ్రామానికి
చెందిన సుశీల, సంతోష్‌ దంపతులకు వారికి స్వప్న (18నెలలు), చిన్న కూతురు (3 నెలలు) సంతానం. అయితే ఇద్దరూ ఆడపిల్లలు పుట్టారని భర్త సంతోష్, అత్త తారుబాయి వేధింపులకు గురిచేశారు. పైగా ఇటీవల వేధింపులు ఎక్కువడంతో సుశీల మనస్థాపం చెందింది. దీంతో భర్త, అత్త కూలీ పనులకు వెళ్లిన సమయంలో ఆమె పిల్లలను హతమార్చి తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రాఖి పండగ సందర్బంగా సంతోష్‌ సోదరి సవిత ఆ ఇంటికి వచ్చింది. చుట్టాల ఇంటికి వెళ్లివచ్చింది. అంతలోనే ఇంటికి వచ్చి బయట తలుపులు తెరిచి ఉండటంతో లోపలికి వెళ్లి చూడగా మరో గదిలో తలుపు గడియ వేసి ఉంది. ఇరుగుపొరుగు వారి సాయంతో తలుపు తీయగా అప్పటికే సుశీల దూలానికి ఉరికి వేలాడుతోంది. అంతేకాకుండా మంచంపై చిన్నారులు కూడా మంచంపై విగతజీవులుగా పడి వండటంతో తల్లి, సోదరుడికి సమాచారం అందించింది. వారు ఇంటికి చేరుకొని విలపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

nanireddy

nanireddy

Next Story