షమీ ఇంటికి వెళతాను.. భార్య హసీన్ జహాన్!

nanireddy
Updated on: 24 Dec 2018 1:25 PM IST
షమీ ఇంటికి వెళతాను.. భార్య హసీన్ జహాన్!
X

గత రెండు నెలలుగా క్రికెటర్ షమీ భార్య హసీన్ జహాన్ తన భర్తపై ఆరోపణలు చేస్తూనే ఉంది. షమీ పై వేధింపులు, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసిన హసీన్.. ఫిక్సింగ్ ఆరోపణలను నిరూపించలేకపోయింది. ప్రస్తుతం వేధింపుల కేసు కోర్టులో ఉండగానే షమీకి హసీన్ మరో షాక్ ఇచ్చింది. షమీ సొంతవూరు ఉత్తరప్రదేశ్ లో సహస్‌ గ్రామానికి వెళ్లేందుకు తనకు రక్షణగా రావాలంటూ డిడౌలీ ఇన్‌స్పెక్టర్‌ రామ్‌సింగ్‌ కటారియాను హసీన్ జహాన్ కోరింది. అంతేకాదు ఇంటికి వెళ్లి తాళం పగులగొట్టి లోపలి వెళ్లాలని ఉందని పోలీసులకు చెప్పింది. ఇంట్లో ఎవరు లేని కారణంగా ఆలా చేయడం భావ్యం కాదని ఆమెకు సూచించారు కటారియా.. ఈ నేపథ్యంలో హసీన్ ఒక్కతే ఇటీవల సహస్‌ గ్రామానికి వెళ్లి వచ్చింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో వెనుదిరిగింది. షమీ కుటుంబసభ్యులు వచ్చిన తరువాత మరోసారి ఆ ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఆమె. కానీ ఆ ఇంటికి ఎందుకోసం వెళ్లాలనుకుంది మాత్రం వెల్లడించలేదు.

nanireddy

nanireddy

Next Story