ఎవరు కొడితే ఈవీఎం బాక్సులు బద్దలవుతాయో...అతడే మోదీ

ఎవరు కొడితే ఈవీఎం బాక్సులు బద్దలవుతాయో...అతడే మోదీ
x
Highlights

ఎవడు కొడితే ఈవీఎం బాక్సులు బద్దలవుతాయో...అతడే మోడీ. 2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చావగొట్టాడు. మహారాష్ట్ర, హర్యానా, యూపీ...ఇలా చాలా ఎన్నో...

ఎవడు కొడితే ఈవీఎం బాక్సులు బద్దలవుతాయో...అతడే మోడీ. 2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చావగొట్టాడు. మహారాష్ట్ర, హర్యానా, యూపీ...ఇలా చాలా ఎన్నో రాష్ట్రాల్లో దిమ్మతిరిగే ఫలితాలు రాబట్టాడు. ఇప్పుడు సొంత రాష్ట్రంలో రఫాడించే రిజల్ట్‌‌ కొల్లగొట్టాడు. తానే ఒక సైన్యంగా, ఒకే ఒక్కడుగా, బాహుబలిగా నరేంద్ర మోడీ అవతరించాడా...ఇక మోడీకి తిరుగులేదా...మోడీని ఢీకొట్టే మొనగాడే పుట్టలేదా...పుట్టబోడా....నరేంద్ర మోడీ, బలశాలిగా ఎలా అవతరించాడు?
అవును. ఒకే ఒక్క మొనగాడు. 2014 ఎన్నికల్లో ప్రభంజనం మోగించాడు. ఇప్పటికీ చెవులు గివ్వుమనే మోగ మోగిస్తూనే ఉన్నాడు. అబ్‌ కీ బార్ మోడీ సర్కార్‌ అంటూ లోక్‌సభ ఎన్నికల్లో జయకేతనం
అబ్‌ కీ బార్...మోడీ సర్కార్‌ అంటూ లోక్‌సభ ఎన్నికల్లో 282 సీట్లు కొల్లగొట్టి, బీజేపీ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని నమోదు చేశాడు మోడీ.
మూడున్నరేళ్లుగా మోదీ వేవ్‌ అప్రతిహతంగా కొనసాగుతోంది. దాదాపు ఎనిమిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశాడు. మరెన్నో రాష్ట్రాల్లో ఎన్డీయే భాగస్వామ్య పాలన నెలకొల్పాడు. ఇప్పుడు మరో రెండు రాష్ట్రాలపై కాషాయ జెండా ఎగురవేశాడు. అంటే మొత్తం 14 రాష్ట్రాల్లో బీజేపీ సాగుతుండగా, మరో 4 రాష్ట్రాల్లో ఎన్డీయే పాలన ఉంది. అంటే టోటల్‌ 18 రాష్ట్రాల్లో కాషాయ పాలన. మోడీ అత్యంత బలశాలిగా అవతరించాడని, ఇవే లెక్కలు చెబుతున్నాయి.
గుజరాత్‌లో చావోరేవో తేల్చుకునేందుకు రంగంలోకి దిగాడు మోదీ. 40 బహిరంగ సభలు, రకరకాల భావోద్వేగ అస్త్రాలు, 28 వేల కిలోమీటర్లు ప్రచారం, ఇలా తన సొంతరాష్ట్రంలో విజయకేతనం ఎగురవేశాడు మోదీ. అక్కడ సీఎం విజయ్‌ రూపానీని, పూర్తిగా పక్కనపెట్టేసి, బాధ్యతలన్నీ తన భుజాలపై వేసుకుని విజయాన్ని ముద్దాడాడు మోడీ. వన్‌ అండ్ ఓన్లీ మోడీ.
హిమాచల్‌ ప్రదేశ్‌లో కాషాయ జెండా ఎగురవేశాడు మోడీ. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చిచెండాడి, కాషాయ జెండా పాతాడు. దటీజ్ మోడీ అనిపించుకున్నాడు.
దేశంలో నెంబర్‌ వన్ పొలిటికల్ లీడర్ మోడీ. ఆసియాలో ప్రబలశక్తి మోడీ. ఎన్నికల క్యాంపెనింగ్‌లో పవర్‌ఫుల్‌ మోడీ. ఇప్పుడు సొంత రాష్ట్రంలో, ఉత్కంఠభరితపోరులో కాషాయ జెండా రెపరెపలాడించాడు.
వచ్చే ఏడాది కర్ణాటకతో పాటు మధ‌్యప్రదేశ్, రాజస్థాన్‌లో జరిగే అసెంబ్లీ సమరాల్లోనూ కదనకుతూహలంతో కదలబోతున్నాడు మోడీ. ఎన్డీయేలో ఇక అన్నీ పార్టీలు, జీహుజూర్‌ అనేలా చేసుకుంటాడు. మరిన్ని సంస్కరణల కొరడాలు తీయబోతున్నాడు. గుజరాత్‌, హిమాచల్‌ అందించిన జోష్‌తో మరింతగా చెలరేగిపోయేందుకు సిద్దమవుతున్నాడు మోడీ.

Show Full Article
Print Article
Next Story
More Stories