ఎన్టీఆర్‌కు భారతరత్నపై తుది నిర్ణయం ప్రధాని మోదీదే!

lakshman
Updated on: 24 Dec 2018 12:12 PM IST
ఎన్టీఆర్‌కు భారతరత్నపై తుది నిర్ణయం ప్రధాని మోదీదే!
X

న్యూఢిల్లీ: దివంగత నేత నందమూరి తారక రామారావుకు భారతరత్న అవార్డు ఇవ్వాలన్న డిమాండ్‌పై కేంద్రం స్పందించింది. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలంటూ ఎంపీ కేశినేని నాని చేసిన డిమాండ్‌పై కేంద్ర హోం శాఖ స్పందిస్తూ... ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకుంటారని కేంద్ర హోంశాఖ తెలిపింది. దీనికి సంబంధించి ప్రతిపాదనలను పీఎంవోకు పంపినట్లు హోంశాఖ నానికి సమాచారం అందించింది.

377 నిబంధన కింద ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలంటూ ఎంపీ కేశినేని నాని జూలై 19న లోక్‌సభలో కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్‌కు అవార్డు ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నోసార్లు కేంద్రానికి విన్నవించారు. అంతేకాకుండా చట్టసభల్లోనూ తీర్మానం చేసి పంపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పలు సందర్భాల్లో ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలన్నారు.

lakshman

lakshman

Next Story