ఏపీలో వైసీపీదే అధికారం : బీజేపీ ఎమ్మెల్యే

nanireddy
Updated on: 24 Dec 2018 1:23 PM IST
ఏపీలో వైసీపీదే అధికారం : బీజేపీ ఎమ్మెల్యే
X

ఏపీలో వచ్చే ఎన్నికలో వైసీపీదే అధికారమని జోస్యం చెప్పారు బీజేపీ ఎమ్మెల్యే. క్రమంగా టీడీపీ గ్రాఫ్ పడిపోతుందన్న ఆయన పాదయాత్రతో వైసీపీ గ్రాఫ్ పెరిగిందని చెప్పుకొచ్చారు. తిరుమల శ్రీవారి దర్శనార్ధం తిరుపతికి వచ్చిన సందర్బంగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఈ వ్యాఖ్యలు చేశారు. 2019లో ఏపీలో వైసీపీ విజయం ఖాయమని తేల్చేశారు. కాబోయే సీఎం జగనేనని ఢంకా భజాయించారు. అంతేకాదు..అవినీతికి టీడీపీ కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్న విష్ణుకుమార్‌రాజు... త్వరలోనే ఆ పార్టీ అసలు రంగు బయటపడుతుందని అన్నారు. ఓటుకు నోటు కేసులో బయటపడి సీఎం చంద్రబాబుపై హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేశారని వ్యాఖ్యానించారు.

nanireddy

nanireddy

Next Story