ఇద్దరు పిల్లల వ్యక్తితో మైనర్ బాలిక మిస్సింగ్..

nanireddy
Updated on: 24 Dec 2018 1:51 PM IST
ఇద్దరు పిల్లల వ్యక్తితో మైనర్ బాలిక మిస్సింగ్..
X

విజయవాడలో మైనర్ బాలిక మిస్సింగ్ కలకలం రేపుతోంది. రాజరాజేశ్వరి పేటకు చెందిన రసూల్ బీ కూతురు గత నాలుగు రోజులుగా కనిపించడం లేదు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కూతురుని ప్రేమ పేరుతో కిడ్నాప్ చేశారని వారు అనుమానిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం బంధువుల శుభకార్యానికి వచ్చిన ఖాసింబేగ్‌ అనే చిత్తూరు యువకుడు మైనర్ బాలికతో సన్నిహితంగా మెలిగాడని తల్లిదండ్రలు చెబుతున్నారు. అయితే అతని ఆ సమయంలో మందలించామని పోలీసులకు చెప్పారు. అయితే అతను చిత్తూరు వెళ్లిన రెండు రోజులకే మైనర్ బాలిక మిస్సైంది. దీంతో ఖాసింబేగే మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశాడని బాలిక బంధువులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న ఖాసింబేగ్‌ నుంచి తమ కూతురును రక్షించాలని కోరుతున్నారు.

nanireddy

nanireddy

Next Story