కోమటిరెడ్డి, సంపత్‌ల సభ్యత్వం రద్దు మంచిదే: అక్బరుద్దీన్

x
Highlights

అసెంబ్లీ నుంచి కోమటిరెడ్డి, సంపత్‌పై బహిష్కరణ వేటును, మిగిలిన కాంగ్రెస్‌ సభ్యుల సస్పెన్షన్‌ను ఎంఐఎం సమర్థించింది. వేటు వేయడం న్యాయబద్ధమైనదన్నారు ఎంఐఎం...

అసెంబ్లీ నుంచి కోమటిరెడ్డి, సంపత్‌పై బహిష్కరణ వేటును, మిగిలిన కాంగ్రెస్‌ సభ్యుల సస్పెన్షన్‌ను ఎంఐఎం సమర్థించింది. వేటు వేయడం న్యాయబద్ధమైనదన్నారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ. అసహన రాజకీయాలతో ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం కాంగ్రెస్‌ పార్టీ ఇకనైనా మానుకోవాలని సూచించారాయన. గవర్నర్ మీద దాడి చేయాలనుకున్నాం కానీ మండలి చైర్మన్‌కు తగిలిందంటూ కాంగ్రెస్‌ నేతలు మాట్లాడటం దురదృష్టకరమన్నారు.

నిన్న సభలో జరిగిన దాడి వీడియో ఫుటేజ్‌ని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఒవైసీ. సభలో జరిగే ప్రతి విషయం ప్రజలకు తెలిస్తే మంచిదన్నారు. దేశంలో అన్ని చోట్ల ఓటమి పాలవటంతో కాంగ్రెస్ పార్టీ అసహనంతో ఉందన్న ఒవైసీ.... ప్రజల తీర్పును కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుందని దుయ్యబట్టారు. సభా గౌరవం కాపాడేందుకు సభ్యులంతా కట్టుబడి ఉండాలని సూచించారు అక్బరుద్దీన్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories