కేరళ వరద బాధితులకు వైసీపీ ఎమ్మెల్యే కోటి విరాళం

nanireddy
Updated on: 24 Dec 2018 2:44 PM IST
కేరళ వరద బాధితులకు వైసీపీ ఎమ్మెల్యే కోటి విరాళం
X

పది రోజులపాటు కురిసిన వర్షాలకు కేరళ అతలాకుతలం అయింది. దీంతో ఆ రాష్ట్రానికి సాయం చేసేందుకు వివిధ సంస్థలతోపాటు రాజకీయ నేతలు, పార్టీలు ముందుకొచ్చాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి కేరళ వరద బాధితులకు కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. ఈ మేరకు కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతుగా రూ.కోటి విరాళాన్ని కేఎంసీ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ చైర్మన్, గౌతమ్‌ రెడ్డి చెప్పారు. ఈ విరాళాన్ని ఈ నెల 28,29 తేదీల్లో స్వయంగా కేరళ వెళ్లి ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కలిసి డీడీని అంజేయనున్నట్టు అయన తెలిపారు.

nanireddy

nanireddy

Next Story