బ్రేకింగ్ : ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం..ప్రధాని దిగ్బ్రాంతి..

nanireddy
Updated on: 24 Dec 2018 1:52 PM IST
బ్రేకింగ్ : ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం..ప్రధాని దిగ్బ్రాంతి..
X

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 44 మంది మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పౌరీ-ఘడ్‌వాల్‌ జిల్లాలోని పిపాలి-బౌనా జాతీయ రహదారిపై నానిదాడా వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న NDRF సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 20 మృతదేహాలను వెలికితీశారు. మరో 24 మంది లోయలో చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న ప్రధాని తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ఆరా తీశారు.

nanireddy

nanireddy

Next Story