జీవితంపై విరక్తి చెంది వివాహిత ఆత్మహత్య

nanireddy
Updated on: 24 Dec 2018 2:43 PM IST
జీవితంపై విరక్తి చెంది వివాహిత ఆత్మహత్య
X

జీవితంపై విరక్తి చెంది వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. అనంతపురం టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని విద్యారణ్యనగర్‌లో నివాసముంటున్న నాగరాజు, లీలావతి (32) దంపతులు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. నాగరాజు స్థానిక సత్యసాయి వాటర్‌ వర్క్‌విభాగంలో హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం లీలావతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బెడ్‌రూంలో చీరతో ఉరివేసుకుంది. కొద్ది సేపటికే ఇంటికి వచ్చిన భర్త నాగరాజు భార్య ఉరికి వేలాడుతూ ఉండటం చూసి హతాశుడయ్యాడు. వెంటనే ఆమెను కిందకు దించాడు. అప్పటికే లీలావతి మృతిచెందింది. అయితే లీలావతి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుందని.. ఈ క్రమంలోనే జీవితంపై విరక్తి చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు పోలీసుల ఫిర్యాదు పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

nanireddy

nanireddy

Next Story