పీటలమీద ఆగినపెళ్లి.. పెళ్లికూతురు వీడియో చూసి..

పీటలమీద ఆగినపెళ్లి.. పెళ్లికూతురు వీడియో చూసి..
x
Highlights

మరికొద్ది క్షణాల్లో పెళ్లి జరుగుతుందనగా పెళ్లికొడుకు పెళ్లి తంతును బలవంతంగా నిలిపివేయించాడు.దీనికి కారణం పెళ్లి కూతురేనని చెప్పాడు. అమలాపురం మండలం...

మరికొద్ది క్షణాల్లో పెళ్లి జరుగుతుందనగా పెళ్లికొడుకు పెళ్లి తంతును బలవంతంగా నిలిపివేయించాడు.దీనికి కారణం పెళ్లి కూతురేనని చెప్పాడు. అమలాపురం మండలం వన్నెచింతలపూడికి చెందిన యువతిని ముమ్మిడివరం మండలం కొత్తలంకకు చెందిన యువకుడికిచ్చి పెళ్లి చేసేందుకు ముహూర్తం నిర్ణయించారు. కొత్తలంకలో వివాహ వేడుక జరగాల్సి వుంది.

బంధువులంతా పెళ్లి వేడుకల్లో బిజీగా ఉన్నారు. ఇంతలో పెళ్లికొడుకు పేరిట కొరియర్‌ వచ్చింది. దాన్ని ఓపెన్ చేయగా అందులో మొబైల్ ఉంది. ఇక ఆ ఫోన్‌లోని వీడియోలు చూసి పెళ్లి కొడుకు షాక్ అయ్యాడు. షాక్ నుంచి నెమ్మదిగా తెరుకున్న వరుడు ఈ పెళ్లి చేసుకోనని ఖరాఖండిగా చెప్పాడు.

ఆ వీడియోల్లో .. తాను పెళ్లిచేసుకోబోయే అమ్మాయి స్నానం చేసి బట్టలు మార్చుకుంటున్నపుడు తీసిన నగ్న దృశ్యాలు ఉన్నాయి. అందులోని వీడియోలు చూసిన అబ్బాయి పెళ్లి రద్దు చేసుకున్నాడు. దీంతో చేసేదేమీ లేక పెళ్లికుమార్తె తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories