వైసీపీలోకి మాజీ మంత్రి.. అవాక్కయిన టీడీపీ!

nanireddy
Updated on: 24 Dec 2018 1:56 PM IST
వైసీపీలోకి మాజీ మంత్రి.. అవాక్కయిన టీడీపీ!
X

క్రమంగా వైసీపీలోకి వలసలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కొందరు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మా పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ లీడర్, మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి ఆ పార్టీలో చేరడానికి ముహూర్తం సిద్ధం చేసుకున్నారు. ఈనెల 11 న తాను వైసీపీలో చేరుతున్నట్టు మహీధర్ రెడ్డి ప్రకటించారు. మహీధర్‌రెడ్డి తిరుపతిలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, పార్టీనేత భూమన కరుణాకరరెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలను కలిశారు. వారితో కలిసి స్థానిక సాయిబాబా గుడిని సందర్శించారు. అనంతరం జగన్ సమక్షంలో తాను వైఎస్సార్‌ సీపీఈ లో చేరుతున్నట్లు వెల్లడించారు. కందుకూరు మండలం మాచవరం గ్రామానికి చెందిన మహీధరరెడ్డిది రాజకీయ కుటుంబం. ఆయన తండ్రి ఆదినారాయణరెడ్డి కందుకూరు నుంచి శాసనసభ్యుడిగా సుదీర్ఘకాలం ఉన్నారు. మహీధర్ రెడ్డి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొన్నటివరకు మహీధర్ రెడ్డి టీడీపీలో చేరతారని అంతా భావించారు కానీ అనూహ్యంగా అయన వైసీపీలో చేరుతుండటంతో టీడీపీనేతలు అవాక్కవుతున్నారు.

nanireddy

nanireddy

Next Story