Top
logo

కవలల మర్డర్ కేసులో మలుపు

కవలల మర్డర్ కేసులో మలుపు
X
Highlights

కవల పిల్లల మర్డర్‌ ప్లాన్‌ ప్రకారమే జరిగినట్లు తెలుస్తోంది. పిల్లలను హత్యచేసిన మామ మల్లికార్జున రెడ్డిపై...

కవల పిల్లల మర్డర్‌ ప్లాన్‌ ప్రకారమే జరిగినట్లు తెలుస్తోంది. పిల్లలను హత్యచేసిన మామ మల్లికార్జున రెడ్డిపై తల్లిదండ్రులు కేసు పెట్టకపోవడంతో హత్య విషయంలో వీరి పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హాస్టల్‌లో జాయిన్‌ చేయిస్తానని ..మిర్యాలగూడ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన మేనమామ పిల్లలను తీసుకువెళ్లడం వెనుక ఉన్న మిస్టరీని చేధించే పనిలో పోలీసులు ఉన్నారు. నిజంగా పిల్లల మానసిక స్థితి బాగాలేదనే మేనమామ హత్య చేశాడా... లేక తల్లిదండ్రులు చంపేయించారా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.అయితే గొంతు నులిమి హత్య చేశాడా... లేక విషం ఇచ్చి చంపాడా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

Next Story