థియేటర్‌లో బాలికపై లైంగికదాడి

nanireddy
Updated on: 24 Dec 2018 1:22 PM IST
థియేటర్‌లో బాలికపై లైంగికదాడి
X

నీటికోసం నల్లా వద్దకు వచ్చిన బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి ప్రయత్నించాడు. అతడి భారీ నుంచి తప్పించుకున్న బాధితురాలు తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన హైదరాబాద్ లోని సనత్ నగర్ లో జరిగింది. సనత్ నగర్ లోని విజేత థియేటర్ లో స్వీపర్ గా పనిచేస్తున్నాడు ప్రశాంత్‌ (25) అనే యువకుడు. థియేటర్ కు సమీపంలో నివసించే బాలిక నీటికోసం తన వదినతో కలిసి థియేటర్ వద్దనున్న నల్లా వద్దకు వచ్చింది. నీటిని పట్టుకుని బాలిక వదిన ఇంటికి వెళ్ళింది. ఇంతలో బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ప్రశాంత్ ఆమెను బలవంతంగా బాత్ రూమ్ లోకి లాక్కొని వెళ్ళాడు. నోట్లో గుడ్డలు కుక్కి చేతులు కట్టేసి లైంగిక దాడి చేయబోయాడు. ఇంతలో బాలిక అతని భారినుంచి తప్పినందుకుని ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చింది. ఏమైందని ఇంట్లో విచారించగా జరిగిన అకృత్యాన్ని వివరించింది. దీంతో బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు.

nanireddy

nanireddy

Next Story