రహస్యంగా ఫోన్ మాట్లాడుతోందని భార్యను..

nanireddy
Updated on: 24 Dec 2018 1:47 PM IST
రహస్యంగా ఫోన్ మాట్లాడుతోందని భార్యను..
X

అనుమానం కారణంగా కట్టుకున్న భార్యను దారుణంగా హతమార్చాడు ఓ వ్యక్తి. ఈ ఘటన కర్నూల్ జిల్లా పగిడ్యాల మండలం వనములపాడులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రత్తమ్మ, శేఖర్ దంపతులు. వారికి ఇద్దరు సంతానం. శేఖర్ తన భార్యను నిత్యం వేధింపులకు గురిచేసేవాడు. ఆమె ఎవరితోనో రహస్యంగా ఫోన్ మాట్లాడుతుందని.. పైగా అందంగా ఎందుకు తయారవుతున్నావు.. అని అనుమానించేవాడు. ఈ విషయమై దంపతులమధ్య పలుమార్లు గొడవ జరిగింది. ఈ క్రమంలో గురువారం రత్తమ్మపై దాడి చేశాడు. దీంతో ఆమె ఎదురుతిరిగింది..అయితే అప్పటికే మద్యం సేవించిన శేఖర్ ఆవేశంతో రత్తమ్మ గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావంతో రత్తమ్మ మృతిచెందిందగా భర్త అక్కడినుంచి పారిపోయాడు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.

nanireddy

nanireddy

Next Story