మద్యానికి డబ్బులేక యువకుడు ఆత్మహత్య!

nanireddy
Updated on: 24 Dec 2018 1:30 PM IST
మద్యానికి డబ్బులేక యువకుడు ఆత్మహత్య!
X

మద్యానికి బానిసైన యువకుడు నిండు జీవితాన్ని మధ్యలోనే చిదిమేసుకున్నాడు. ఎక్కడో పొరుగురాష్ట్రం నుంచి వలసవచ్చి మద్యం బారిన పడ్డాడు. ఈ క్రమంలో శృతిమించడంతో తాగేందుకు డబ్బులు లేక ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ ఘటన నిజామాబాదు జిల్లా కోజాకాలనీలో చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన శివరాం(26) తల్లీ, అన్నాచెల్లెలితో కలిసి నిజామాబాద్ కు వలసవచ్చాడు. స్థానికంగా బిల్డింగ్ పనులకు వెళ్తూ వచ్చిన డబ్బుతో మద్యాన్ని సేవించేవాడు. కుటుంబసభ్యులు ఎంత చెప్పిన వినిపించుకోకుండా మద్యం మహమ్మారినుంచీ దూరంకాలేకపోయాడు. ఈ క్రమంలో మద్యం తాగడం కోసం తన వద్ద డబ్బులు లేకపోవడంతో చెల్లిని అడిగాడు ఆమె తనవద్ద లేవని సమాధానం చెప్పింది. పైగా కుటుంబసభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురైన శివరాం ఉరివేసుకు ఆత్మహత్యకు చేసుకున్నాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

nanireddy

nanireddy

Next Story