కామాంధుడి అసభ్య చేష్టలు.. బడితే పూజ చేసిన అమ్మాయిలు

nanireddy
Updated on: 24 Dec 2018 1:25 PM IST
కామాంధుడి అసభ్య చేష్టలు.. బడితే పూజ చేసిన అమ్మాయిలు
X

అమ్మాయిల ఎదుట అసభ్య చేష్టలకు పాల్పడ్డాడు ఓ కామాంధుడు.దీంతో అతనికి తగిన బుద్ది చెప్పారు యువతులు. మధ్యప్రదేశ్ లోని భిండ్‌ ప్రాంతంలో అమ్మాయిల కోచింగ్ సెంటర్ వద్దకు ఓ యువకుడు వచ్చాడు.రాగానే సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నట్టు నటిస్తూ ప్యాంటూ విప్పి వికృత చర్యలకు పాల్పడ్డాడు. మొదట్లో అమ్మాయిలు పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఆ యువకుడు మళ్ళీ మరుసటి రోజు వచ్చి అసభ్య చేష్టలకు పాల్పడుతున్నాడు. దీంతో విసుగు చెందిన అమ్మాయిలు అతనికి బుద్ధి చెప్పాలనుకున్నారు. కొందరు స్థానికుల సాయంతో అతనికి బడితే పూజ చేసి.. అనంతరం పోలీసులకు అప్పగించారు. అతడి వికృత చేష్టలు సీసీటీవీలో రికార్డ్ అవడంతో నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

nanireddy

nanireddy

Next Story