కొబ్బరికాయల సాకుతో బాత్‌రూమ్ దృశ్యాల్ని రికార్డ్!

కొబ్బరికాయల సాకుతో బాత్‌రూమ్ దృశ్యాల్ని రికార్డ్!
x
Highlights

దొంగలు కొబ్బరికాయలు కోసుకుపోతారన్న కారణంతో కొబ్బరితోటకు సీసీ కెమెరాలు అమర్చాడు ఓ యజమాని. అయితే అతను తమ బాత్‌రూమ్ దృశ్యాల్ని రికార్డ్ చేస్తున్నాడని...

దొంగలు కొబ్బరికాయలు కోసుకుపోతారన్న కారణంతో కొబ్బరితోటకు సీసీ కెమెరాలు అమర్చాడు ఓ యజమాని. అయితే అతను తమ బాత్‌రూమ్ దృశ్యాల్ని రికార్డ్ చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు కొందరు మహిళలు. వివరాల్లోకి వెళితే తూ.గో.జిల్లా పి.గన్నవరం మండలం లంకలగన్నవరానికి చెందిన వినాయకరావు అనే వ్యక్తికి కొబ్బరితోట ఉంది. ఆ తోటలో కాయలు కోస్తారేమోనని కొబ్బరి చెట్లకు సీసీ కెమెరాలు బిగించాడు. కానీ చుట్టుపక్కల ఉన్న ఇళ్లలోని బాత్‌రూమ్‌లో దృశ్యాలు క్లియర్‌గా కనిపించేలా వీటిని సెట్ చేశాడు. దీన్ని గుర్తించిన మహిళలు అతనితో గొడవపడ్డారు. అయినా అతను పట్టించుకోలేదు.

పైగా కొన్ని వీడియోలు బయట చూపించి తమను వేధిస్తున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై నాలుగు రోజుల కిందటే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐనా.. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మహిలా సంఘాలతో కలిసి ధర్నా చేశారు. చివరికి తోటకు వచ్చి అక్కడ కెమెరాలు ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసులు.. వాటిని తీసేయించారు. కొబ్బరి చెట్లకు బాగా ఎత్తున కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా చుట్టుపక్కల జరిగేదంతా క్లియర్‌గా కనిపించేలా ఏర్పాటు చేసుకున్నట్టు తేల్చారు. దీంతో వినాయకరావు ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories