Top
logo

మమత.. అంత సులువుగా కేసీఆర్ కు చాన్స్ ఇస్తారా?

మమత.. అంత సులువుగా కేసీఆర్ కు చాన్స్ ఇస్తారా?
X
Highlights

ఉత్తరాది రాజకీయ నాయకుల ఆధిపత్యం.. దక్షిణ రాష్ట్రాలపై ఎప్పుడూ కొనసాగుతూనే వస్తోంది. కానీ.. ఈ మధ్య.. తెలంగాణ...

ఉత్తరాది రాజకీయ నాయకుల ఆధిపత్యం.. దక్షిణ రాష్ట్రాలపై ఎప్పుడూ కొనసాగుతూనే వస్తోంది. కానీ.. ఈ మధ్య.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. బీజేపీ, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా మూడో ఫ్రంట్ ఏర్పాటు చేస్తా అని ప్రకటించినప్పటి నుంచి ఈ పరిస్థితిలో మార్పు అని చెప్పలేం కానీ.. కాస్త కదలిక మాత్రం కనిపిస్తోంది. కేసీఆర్ అడుగులపై ఇతర పార్టీల నేతలు.. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వేస్తున్న అడుగులు కూడా.. రాజకీయ వర్గాలనే కాదు.. సామాన్య ప్రజలనూ ఆకర్షిస్తున్నాయి.

ఓ వైపు కేసీఆర్ తో సమావేశమైన మమత.. మరోవైపు ఎన్సీపీ అధినేత శరద్ పవార్, టీడీపీ, ఇతర పార్టీల నేతలను కూడా కలిశారు. వారితోనూ చర్చలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా కూటమి ఉండాలని.. కేసీఆర్ మాదిరే కామెంట్లు కూడా చేస్తున్నారు. కానీ.. నేరుగా కేసీఆర్ నాయకత్వంలో కూటమి ఏర్పాటు అని మాత్రం ఆమె క్లారిటీ ఇవ్వడం లేదు. అందరితో చర్చించి.. ఓ నిర్ణయం తీసుకుంటామని మాత్రమే అంటున్నారు.

దీంతో.. కేసీఆర్ దూకుడును.. మమత ముందే కంట్రోల్ చేస్తున్నారా.. ఆయన జాతీయ స్థాయిలో నాయకత్వం వహించాలని పడుతున్న ఆరాటానికి మమతే అడ్డుగా మారుతున్నారా అన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఓవైపు టీఆర్ఎస్ వర్గాలేమో.. మమత తమ అధినేతకు అనుకూలంగానే మాట్లాడుతున్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నాయి.

మరోవైపు.. దీదీ మాత్రం.. అన్ని పార్టీల నేతలను కలుస్తున్నట్టుగానే.. కేసీఆర్ ను కూడా ఓ పార్టీ నాయకుడిగా ట్రీట్ చేస్తున్న విషయం స్పష్టమవుతోంది. పట్టు పడితే అంత సులువుగా వదలని మమత.. మరి కేసీఆర్ ను కొత్త ఫ్రంట్ నాయకుడిగా అంగీకరిస్తారా అంగీకరించరా.. అన్నది కూడా ఈ పరిణామాలతో కాస్త ఆలోచించాల్సిన విషయంగా కనిసిపిస్తోంది. కొన్నాళ్లు గడిస్తే తప్ప.. ఈ అయోమంలో స్పష్టత వచ్చేలా లేదు.

Next Story