పార్కుల్లో పాడు పనులు..రూ. 500 ఇస్తే మీ ఇష్టం...

పార్కుల్లో పాడు పనులు..రూ. 500 ఇస్తే మీ ఇష్టం...
x
Highlights

హైదరాబాద్ లోని ఇందిరా పార్కు, సంజీవయ్య పార్కు, దుర్గం చెరువు... ఈ ప్రాంతాల్లో సందర్శకుల మాట ఎలా ఉన్నా, సెక్యూరిటీ గార్డుల ప్రోత్సాహంతో సాయంత్రానికి...

హైదరాబాద్ లోని ఇందిరా పార్కు, సంజీవయ్య పార్కు, దుర్గం చెరువు... ఈ ప్రాంతాల్లో సందర్శకుల మాట ఎలా ఉన్నా, సెక్యూరిటీ గార్డుల ప్రోత్సాహంతో సాయంత్రానికి ఎక్కడెక్కడి నుంచో ప్రేమ పక్షలు వాలిపోయి, సినిమాల్లో కనిపించని రొమాంటిక్ సీన్లను చూపిస్తున్నాయి. హోటళ్లపై పోలీసుల నిఘా ఎక్కువగా ఉండటంతో, లవర్స్ పార్కులను ఆశ్రయిస్తుండగా, వారి నుంచి చేతికి అందినంత డబ్బులు వసూలు చేస్తున్న సెక్యూరిటీ గార్డులు సీక్రెట్ ప్లేస్ లను చూపిస్తున్నారని తెలుస్తోంది. ప్రేమికులతో పాటు కొంత మంది ఇతరులూ వచ్చి అసభ్యంగా వ్యవహరిస్తున్నారు. చెట్ల చాటు, పొదల చాటుకు వెళ్లి అసాంఘిక కలాపాలు గుట్టుగా సాగిస్తున్నారు. తెలియక వచ్చిన వారు అక్కడి కార్యకలాపాలను చూడలేక సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోంది. రోజుకు ఒక్క పార్కుకు ప్రేమికులే సుమారు 100కు పైగా వస్తున్నారు. వారాంతాల్లో ఈ సంఖ్య రెట్టింపు అవుతోంది. భద్రతా సిబ్బందే అసాంఘిక పనులకు కాపలాగా ఉంటున్నారనే ఆరోపణలూ ఉన్నాయి.

వెకిలి చేష్టలు చేసేందుకు ఉద్యానాల్లో కావాల్సిన చాటు స్థలాలు చూపేందుకు భద్రతా సిబ్బంది ప్రత్యేక ధరలు చెప్పి సొమ్ము చేసుకుంటున్నారు. అడ్డుకోవాల్సిన వారే ప్రోత్సాహిస్తూ పోలీసులు, అధికారుల పేర్లు చెప్పి రూ.50 నుంచి 200 వరకు వసూలు చేస్తున్నారు. అమ్మాయి, అబ్బాయి పార్కులోకి వెళ్తే వారిలో లేని ఉద్దేశాలు కల్పించి లేనిపోని అభ్యంతరాలు తెలిపి అక్కడి సిబ్బందే డబ్బు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఒక వేళ ప్రేమికులే పార్కుకు వస్తే వారికి చాటు స్థలాలు చూపి ఎవరికీ కనిపించని స్థలం అయితే రూ.500 వరకు తీసుకుంటున్నారు. వెంగళరావునగర్‌ పార్కు ప్రధాన రహదారికి రెండు పక్కల ఉండడంతో అక్కడి ప్రేమికుల చేష్టలు రోడ్డుపై వెళ్లే వాళ్లకంటపడుతున్నాయి. వేసవిలో రాత్రి 11 దాటిందంటే అంతా యథేచ్ఛగా ఉంటోందని పార్కుల పక్కన ఉన్న స్థానికులు తెలిపారు. ప్రేమికుల్లో కొందరు మరింతగా బరి తెగిస్తున్నారు. లాడ్జీలపై పోలీసుల పక్కానిఘా ఉండటంతో కొంత మంది యువకులు ఇలా ఉద్యానాల వెంట పడుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories