ప్రశాంత్ రెడ్డితో నా వివాహం జరగాలి.. యువతి..

nanireddy
Updated on: 24 Dec 2018 1:56 PM IST
ప్రశాంత్ రెడ్డితో నా వివాహం జరగాలి.. యువతి..
X

ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించాలని కోరుతూ ఓ యువతి చేపట్టిన మౌన దీక్ష నాల్గవ రోజుకు చేరింది. దీంతో ఆమెకు పలు మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మర్రిగడ్డకు చెందిన ప్రశాంత్ రెడ్డి, సికింద్రాబాద్ అల్వాల్‌లోని సత్య అనే యువతికి స్నేహం ఏర్పడింది. అయితే తనను ప్రశాంత్ రెడ్డి ప్రేమించి మోసం చేశాడని, ఆయనతో పెళ్లి జరిపించాలని కోరుతూ జూన్ 21న చందుర్తి పీఎస్ ఆవరణలో నిద్రమాత్రలు మింగింది. అనంతరం జులై 1న ప్రశాంత్ స్వగ్రామం మర్రిగడ్డ గ్రామంలో వాటర్ ట్యాంక్ ఎక్కి నిద్రమాత్రలు మింగింది. ఐతే.. తాను సత్యను ప్రేమించలేదని, కేవలం పరిచయం మాత్రమే ఉందని ప్రశాంత్ సైతం పురుగుల మందు తాగాడు. ఇరువురిని ఆస్పత్రికి తరలించగా, ఇద్దరూ కోలుకున్నారు.

nanireddy

nanireddy

Next Story