ఒకరితో సహజీవనం.. మరొకరితో ప్రేమ

nanireddy
Updated on: 24 Dec 2018 2:45 PM IST
ఒకరితో సహజీవనం.. మరొకరితో ప్రేమ
X

ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి సహజీవనం చేస్తున్నాడు. అదే సమయంలో తన స్నేహితురాలిని చూడటానికి వచ్చిన యువతిపై కన్నేసి ఆమెను కూడా లోబర్చుకున్నాడు. దీంతో గుట్టురట్టయ్యి ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కబెట్టే పరిస్థితికి వచ్చాడో వ్యక్తి. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌12లోని శ్రీరాంనగర్‌కు చెందిన ప్రేమ్‌కుమార్‌(26) ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. ఈ క్రమంలో అతనికి నాలుగు నెలల క్రితం స్రవంతి (26) అనే యువతితో పరిచయం ఏర్పడింది. కొంతకాలానికే ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రేమ్ కుమార్ స్రవంతిని లోబరుచుకుని ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. ఇదే సమయంలో ఆమె స్నేహితురాలు ప్రియాచౌదరి ఒకరోజు స్రవంతిని చూడటానికని వారి ఇంటికి వచ్చింది. దీంతో ఆమెపై కూడా సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టాడు.అయితే వీరి వ్యవహారంపై స్రవంతి నిలదీయడంతో ఆమెను చంపేస్తానంటూ హెచ్చరించడమే కాకుండా రెండు రోజులక్రితం తీవ్రంగా కొట్టాడు. బాధితురాలి పిర్యాదు మేరకు ప్రేమ్‌కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

nanireddy

nanireddy

Next Story