కులాల అడ్డు.. ప్రేమజంట ఆత్మహత్య!

nanireddy
Updated on: 24 Dec 2018 1:51 PM IST
కులాల అడ్డు.. ప్రేమజంట ఆత్మహత్య!
X

పెద్దలు తమ ప్రేమను అంగీకరించలేదని ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన తమిలనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా మాదినాయన్‌పల్లిలో జరిగింది. మాదినాయన్‌పల్లి మండలం ఇంద్రానగర్‌కు చెందిన అశోక్‌ (19). అదే ప్రాంతానికి మాదేవి (19). ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. ఒకే గ్రామంలో నివసిస్తున్న అశోక్, మాదేవికి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇరుకుటుంబాలకు తెలిసి వారిని మందలించారు. అయితే తాము విడిపోమని.. తమకు పెళ్లి చెయ్యాలని కుటుంబసభ్యుల్ని వేడుకున్నారు. ఇద్దరి కులాలు వేరని పెళ్ళికి ససేమీరా అన్నారు. దీంతో మనస్థాపం చెంది విషం తాగారు. అపస్మారక స్థితిలో పడివున్న వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అశోక్, మాదేవి మృతిచెందారు. కాగా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

nanireddy

nanireddy

Next Story