బిర్యానీలో బల్లి.. ఆసుపత్రిపాలైన కస్టమర్లు..

nanireddy
Updated on: 24 Dec 2018 1:47 PM IST
బిర్యానీలో బల్లి.. ఆసుపత్రిపాలైన కస్టమర్లు..
X

విజయవాడలోని ఓ హోటల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా బిర్యానీలో బల్లి ఉండిపోయింది. టీచర్స్ కాలనీలోని సిల్వర్ స్పూన్ హోటల్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బల్లి పడిన బిర్యానీ తిని ఇద్దరు కస్టమర్స్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యంపై వినియోగదారులు అధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా సిల్వర్ స్పూన్ హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.బల్లి పడిన చికెన్ బిర్యానీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శాంపిల్స్ సేకరించి విచారణ జరుపుతున్నారు.

nanireddy

nanireddy

Next Story