లైంగిక సంబంధానికి నిరాకరించినందుకు బాలికపై.. యువతి యాసిడ్ దాడి

లైంగిక సంబంధానికి నిరాకరించినందుకు బాలికపై.. యువతి యాసిడ్ దాడి
x
Highlights

లైంగిక సంబంధానికి నిరాకరించినందుకు ఓ బాలికపై యాసిడ్ పోసింది ఓ యువతి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో జరిగింది. స్థానిక ఫిరోజాబాద్‌ పోలీస్టేషన్...

లైంగిక సంబంధానికి నిరాకరించినందుకు ఓ బాలికపై యాసిడ్ పోసింది ఓ యువతి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో జరిగింది. స్థానిక ఫిరోజాబాద్‌ పోలీస్టేషన్ పరిధిలో తలిదండ్రులతో కలిసి నివాసముంటోంది ఓ బాలిక. అదే ప్రాంతంలో మరో యువతి తన తలిదండ్రులతో ఉంటోంది. ఇద్దరూ స్నేహితులు. వీరిద్దరి మధ్య గత కొంత కాలంగా లైంగిక సంబంధం ఉన్నట్టు వెల్లడైంది. అయితే, తనను పెళ్లి చేసుకోవాలని యువతి బాలికపై ఒత్తిడి తెస్తోంది. దీంతో వారిమధ్య కలతలు వచ్చాయి. పైగా బాలిక లైంగిక సంబంధానికి అడ్డుచెప్పడంతో యువతి కోపం పెంచుకుంది. ఆమెను అంతమొందించాలని ప్లాన్‌ వేసింది. అందులో భాగంగా బాలిక ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తుండగా యువతి ఆమెపై యాసిడ్‌తో దాడి చేసి పరారైంది. తీవ్ర గాయాలపాలైన బాధితురాలిని తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తల్లిదండ్రుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories