చావు గురించి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు చివరి మాటలు..

చావు గురించి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు చివరి మాటలు..
x
Highlights

మావోయిస్టుల ఘాతుకానికి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోములు బలైపోయారు. నిన్న ఉదయం పది గంటల ప్రాంతంలో 50 మందికి పైగా...

మావోయిస్టుల ఘాతుకానికి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోములు బలైపోయారు. నిన్న ఉదయం పది గంటల ప్రాంతంలో 50 మందికి పైగా మావోయిస్టులు అందులో దాదాపు 30 మంది మహిళా మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో వీరిద్దరూ మృతిచెందారు. ఇక కిడారి హత్యకు ముందు ఆయన మాట్లాడిన మాటలు పలువురిని కంటతడి పెట్టిస్తున్నాయి. మన్యంలో ప్రబలిన విషజ్వరాలపై రాజకీయం చేయకుండా వారికీ అండగా నిలవాలని.. వీలైతే వారిని ఆసుపత్రిలో చేర్పించి సాయం అందించాలని కోరారు. అంతేకాదు.. అందరూ ఏదో ఒకరోజు శవమై పోవలసిందేనని.. తనతోపాటు అందరూ సమాధి కావలసిందేనని.. అది కొంత ఎక్కువో తక్కువో ఉండొచ్చు అని అన్నారు. కాగా వీరి మృతిపై సీఎం చంద్రబాబు, ప్రతిపక్షనేత వైయస్ జగన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో హత్యలకు తావు లేదని మావోల దుశ్చర్యను ఖండించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories