లగడపాటి జోస్యం నిజమైతే కూటమి స్టెప్పులేంటి?

లగడపాటి జోస్యం నిజమైతే కూటమి స్టెప్పులేంటి?
x
Highlights

లగడపాటి జోస్యం నిజమైతే అదొక సంచలనం. మరి ప్రజాకూటమి గెలిస్తే, గల్లీ నుంచి ఢిల్లీ వరకు చోటు చేసుకునే పరిణామాలేంటి? జాతీయ రాజకీయాలపైనా, ఆంధ్రప్రదేశ్‌...

లగడపాటి జోస్యం నిజమైతే అదొక సంచలనం. మరి ప్రజాకూటమి గెలిస్తే, గల్లీ నుంచి ఢిల్లీ వరకు చోటు చేసుకునే పరిణామాలేంటి? జాతీయ రాజకీయాలపైనా, ఆంధ్రప్రదేశ్‌ సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఓడితే కూటమి పయనమెటు?

ప్రజాకూటమి విజయం సాధిస్తే, పరిపాలన ఎలా ఉంటుందో తెలీదు కానీ, సీఎం ఎవరనేదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఎవరికివారే కాంగ్రెస్ సీనియర్లు ఉద్దండులుగా ఫీలవుతున్న నేపథ్యంలో, ఢిల్లీలో జోరుగా లాబీయింగ్ చేయొచ్చు. మరి అధిష్టానం ఎవరి మెడలో వరమాల వేస్తుందో. ఇక సీఎం కూడా నిర్ణమయ్యాక, అసలుసిసలు పరిపాలన. మంత్రివర్గంలో టీడీపీ, టీజేఎస్‌, సీపీఐల ప్రజాప్రతినిధులకు ఏమేరకు ప్రాతినిధ్యం వహిస్తుందో తెలీదు. మేనిఫెస్టో హామీలకు నిధుల అన్వేషణ మొదలవుతుంది. వీటితో పాటు గత ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులు, నిర్ణయాలపై సమీక్ష ఉండొచ్చు.

ప్రజాకూటమి గెలిస్తే నేషనల్ పాలిటిక్స్‌పై దాని ప్రభావం అధికం. మోడీ పాలన ఒక్కదఫాతోనే ముగిసిపోవాలని కోరుకుంటున్న శక్తులన్నిటికి ఇది ఆశ కలిగిస్తుంది. తెలంగాణ నుంచి, తెలంగాణ విజయం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో, ఇక తమకు తిరుగుండదని చంద్రబాబు భావించొచ్చు. ఇక్కడి ఫలితాలు చూపి, అక్కడ ఓట్లడిగినా ఆశ్చర్యంలేదు. బిజెపి వ్యతిరేక శక్తులే అధికంగా విజయం సాధిస్తాయని, అనేక వ్యూహాలకు పదునుపెట్టొచ్చు. కాంగ్రెస్‌తో కలిసి అసెంబ్లీ, పార్లమెంట్్ ఎన్నికల్లోనూ పోటీ చేయొచ్చు. జాతీయస్థాయిలో మోడీ వ్యతిరేక శక్తుల పునరేకీకరణలో చంద్రబాబు కీలక పాత్ర పోషించొచ్చు.

ఒకవేళ కాంగ్రెస్‌ ఓడిపోతే, ప్రజాకూటమి బద్దలవుతుంది. కాంగ్రెస్‌, టీడీపీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా, గోడ దూకే ఛాన్సుంది. చంద్రబాబు ఫ్రంట్‌ పాలిటిక్స్‌కు బ్రేక్‌ పడొచ్చు. ఏపీలోనూ బాబుతో పొత్తుపై హస్తం పార్టీ పునరాలోచన చేయొచ్చు. పీసీసీలోనూ ప్రక్షాళన తప్పకపోవచ్చు. అయితే, ఇక్కడ ఓడినా, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌‌, ఛత్తీస్‌గఢ్‌లో తమకు అనుకూలంగా ఫలితాలు వస్తే, ఇప్పుడిప్పుడే మార్పులు-చేర్పులు ఉండకపోవచ్చు. ప్రజాఫ్రంట్‌ కూడా చీలిపోయే ఛాన్స్‌ ఉండకపోవచ్చు. అయితే, ఎగ్జిట్‌పోల్స్‌ కాంగ్రెస్‌ కూటమికి నెగెటివ్‌గా చెప్పినా, లగడపాటి జోస్యం, పెరిగిన ఓటింగ్ పర్సంటేజీ, వారిలో ఆత్మవిశ్వాసం నింపుతోంది. కానీ ఈవీఎం విప్పితేనే, ప్రజాతీర్పు తెలుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories