కాబోయే సీఎం కుమారస్వామి గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్..!

nanireddy
Updated on: 24 Dec 2018 1:30 PM IST
కాబోయే సీఎం కుమారస్వామి గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్..!
X

కర్ణాటకకు 23 ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు కుమారస్వామి. అయితే అయన భార్యకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. కుమారస్వామికి రెండు పెళ్లిళ్లు. మొదటగా(1986)లో కుమారస్వామి అనితను వివాహం చేసుకున్నారు. వారికీ కుమారుడు ఇటీవల జాగ్వార్ సినిమాతో హీరోగా పరిచయమైన నిఖిల్ కుమార్ ఉన్నారు. అయితే 2006 లో ప్రముఖ హీరోయిన్ రాధికను రెండో వివాహం చేసుకున్నారు కుమారస్వామి. ప్రస్తుతం వారికీ షమిక అనే కూతురు ఉంది. అయితే పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత. 2010లో తమ వివాహం గురించి రాధిక అధికారికంగా వెల్లడించారు. కాగా రాధిక 2002లో రతన్ కుమార్‌ను వివాహం చేసుకున్నారు. కొద్దికాలానికే అతని నుంచి విడిపోయింది రాధికా. ఇదిలావుంటే ఇప్పటివరకు ఆమె 30 సినిమాలకు పైగానే నటించారు.

nanireddy

nanireddy

Next Story