Top
logo

హవా అంతా తారకరాముడిదే!! కేటీఆర్‌... కేసీఆర్‌ వదిలిన బాణమా?

హవా అంతా తారకరాముడిదే!! కేటీఆర్‌... కేసీఆర్‌ వదిలిన బాణమా?
X
Highlights

ఒకవైపు మహాకూటమి అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. ఇప్పుడు రంగంలోకి దిగి, అలసిపోవడం ఎందుకని కేసీఆర్‌ వ్యూహాత్మక...

ఒకవైపు మహాకూటమి అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. ఇప్పుడు రంగంలోకి దిగి, అలసిపోవడం ఎందుకని కేసీఆర్‌ వ్యూహాత్మక మౌనం. మరి గులాబీ అభ్యర్థుల ప్రచార వేడి, తగ్గకూడదంటే ఏం చెయ్యాలి...క్యాండెట్స్‌లో హుషారు నింపాలంటే ఏ అస్త్రం ప్రయోగించాలి....అసంతృప్తులు, అలకలను చల్లార్చాలంటే ఏ ఆయుధం వదలాలి...అందుకే కేసీఆర్‌ ఒక బాణం వదిలారు...ఇప్పుడా బాణం, కేసీఆర్‌ కంటే ముందు మొత్తం నియోజకవర్గాలను సుడిగాలిలా చుట్టేస్తోంది...ఇంతకీ ఏంటా ఆయుధం... అసెంబ్లీ రద్దు, అభ్యర్థుల్ ప్రకటన తర్వాత, కేసీఆర్‌ కొన్ని సభల్లో మాట్లాడినా, ఎక్కువ శాతం మాత్రం, కేటీఆరే, గులాబీ ప్రచార భారాన్ని మొత్తం తన భుజాలపైనే వేసుకున్నాడు. అన్ని జిల్లాల్లోనూ తిరుగుతూ, ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తూ, సమన్వయకర్తల సమావేశాల్లో పాల్గొంటూ, చేరికలను ప్రోత్సహిస్తూ, ఇలా అన్నీతానై కనపడుతున్నారు కేటీఆర్.

పార్టీలో అంత‌ర్గత విభేదాల వ‌ల్ల ఇబ్బందులు ఎదుర్కుంటున్న నియోజ‌క‌వ‌ర్గాల బాధ్యత‌లు కూడా కేటీఆర్ భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల‌కు ఎదురుగాలి వీస్తున్న నియోజ‌క‌వ‌ర్గాలతో పాటు క్యాండిడేట్స్ ఎవ‌రు కోరినా, కాద‌న‌కుండా నియోజ‌క‌వ‌ర్గ ప‌ర్యట‌న‌ల‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ స‌మావేశాల‌తో కార్యక‌ర్తల్లో జోష్ నింపేందుకు ప్రయ‌త్నాలు చేస్తున్నారు. గ్రేట‌ర్‌లోని 24 నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌నీసం 15 నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం సాధించాల‌ని భావిస్తుంది టీఆర్ఎస్. అందుకే సెటిల‌ర్ల వ్యవ‌హారాన్ని కేటీఆర్‌కు అప్పగించిన‌ట్లు తెలుస్తోంది. సెటిట‌ర్లుండే నియోజ‌క‌వ‌ర్గాలపై ఏపీ సీఎం చంద్రబాబు క‌న్నేయ‌టంతో సెటిల‌ర్లపై ప్రత్యేక దృష్టి సారించారు. సెటిట‌ర్లుండే నియోజ‌క‌వ‌ర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల‌ను గెలిపించి.. చంద్రబాబుకు చెక్ పెట్టేందుకు ప‌క్కా స్కెచ్ వేస్తోంది గులాబీదళం.

ఎన్నిక‌ల‌ ప్రచారం ముగిసే నాటికి కేటీఆర్... త‌న‌కు అప్పగించిన ప‌నిని పూర్తి చేసేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నారని భవన్‌లో అనుకుంటున్నారు. నిత్యం అభ్యర్థుల‌తో ట‌చ్‌లో ఉండి ఎక్కడిక్కడ స‌మ‌స్యలు ప‌రిష్కరించ‌టం.. వ్యూహాలు.. ప్రతి వ్యూహాల‌తో అభ్యర్థుల‌ను రీచార్జ్ చేసే బాధ్యత‌లను పర్యవేక్షిస్తున్నారు కేటీఆర్. అంతేకాదు, మహాకూటమి అభ్యర్థుల ప్రకటన తర్వాత, కేసీఆర్‌ ప్రచారాన్ని హోరెత్తించబోతున్నారు. ఆ గ్యాప్‌లో గులాబీ క్యాంపెయిన్‌ను పరుగులు పెట్టిస్తున్నారు కేటీఆర్. ప్రచార వేడి తగ్గకుండా, హీటెక్కిస్తున్నారు.

Next Story