బస్సులో కోడికీ టికెట్‌ కొట్టిన కండక్టర్..

nanireddy
Updated on: 24 Dec 2018 1:52 PM IST
బస్సులో కోడికీ టికెట్‌ కొట్టిన కండక్టర్..
X

టికెట్ లేకుండా బస్సులో ప్రయాణించడం నేరం.. అందుకు జరిమానా రూ. --- అని బస్సులో రాసిపెట్టడం కామన్. ఆ హెచ్చరికను కచ్చితంగా అమలు చేస్తున్నారా..? అంటే ప్రశ్నార్ధకమే..? కానీ కర్ణాటకలోని ఓ కండక్టర్ మాత్రం తన విధులను చక్కగా నిర్వర్తిస్తున్నాడు. బస్సులో టికెట్ ప్రయాణికులకు కాదు కోళ్లు, కుక్కలు,పిట్టలకు తీసుకోమని హెచ్చరిస్తున్నాడు. ఆదివారం బెంగళూరు సమీపంలో గౌరిబిదనూరు తాలూకా ముదలోడు గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ తన రెండు కోళ్లను తీసుకుని కర్ణాటక ఆర్టీసీ బస్సెక్కాడు. బస్‌కండక్టర్‌ అతనికి రూ.24 టికెట్, రెండు కోళ్లకు రెండు హాఫ్‌ టికెట్లు ఇచ్చాడు. దీంతో శ్రీనివాస్ తోపాటు మిగితా ప్రయాణికులంతా అవాక్కయ్యారు.

nanireddy

nanireddy

Next Story