ఆ మూడు గ్రామాల్లో అంతులేని విషాదం

ఆ మూడు గ్రామాల్లో అంతులేని విషాదం
x
Highlights

ఆ మూడు గ్రామాలు ఇప్పడు మూగబోయాయి. ఒకపక్క నిశ్శబ్ధంగా రోదిస్తుంటే... మరోపక్క ఆర్తనాదాలు ఆకాశన్నంటుతున్నాయి. మృతుల కుటుంబాల్లో అంతులేని విషాదం నెలకొగా...

ఆ మూడు గ్రామాలు ఇప్పడు మూగబోయాయి. ఒకపక్క నిశ్శబ్ధంగా రోదిస్తుంటే... మరోపక్క ఆర్తనాదాలు ఆకాశన్నంటుతున్నాయి. మృతుల కుటుంబాల్లో అంతులేని విషాదం నెలకొగా వందలాది మంది తమ వారి కోసం దిక్కులు పిక్కటిల్లేలా బోరుమంటున్నారు. శనివారపుపేట, తిమ్మాయిపల్లె, హిమ్మత్‌రావుపేట ఈ మూడు గ్రామాలు ఆర్తనాదాలు పెడుతున్నాయి. తమ వారిని మృత్యు మలుపులో బస్సు నిలువునా ప్రాణాలు తీసేసిందని దిక్కులు పిక్కటిల్లెలా రోదిస్తున్నాయి. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల నుంచి టౌన్‌కు బస్సులు తక్కువగా తిరుగుతుంటాయి. రోజుకు రెండో, మూడో ట్రిప్పులకంటే ఎక్కువ ఉండవు. శనివారపుపేట, తిమ్మాయిపల్లె, హిమ్మత్‌రావుపేట ఈ మూడు గ్రామాలకు కూడా అంతే.

కొండగట్టు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఈ మూడు గ్రామాల ప్రజలే ఎక్కువ. టౌన్‌కు వివిధ పనుల కోసమని పొద్దున వెళ్లడం, తిరిగి సాయంత్రం ఊరికి రావడం ఇదీ ఈ మూడు గ్రామాల నుంచి జనరల్‌గా జరిగే ప్రక్రియ. దీనికి తగ్గట్టుగానే ఆర్టీసీ కూడా ఈ మూడు గ్రామాలకు బస్సును పొద్దున ఒక ట్రిప్పు, సాయంత్రం ఒక ట్రిప్పు నడుపుతోంది ఆర్టీసీ. పొద్దున బస్సు పోతే ఇంకో బస్సు రాత్రికి గానీ రాదన్న ఆతృత కూడా కొండగట్టు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరగడానికి కారణంగా కనిపిస్తుంది. ఏమైనా ఈ మూడు గ్రామాల్లో ఇప్పుడు విషాద వాతావరణం కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories