నేడు కాంగ్రెస్ లో చేరనున్న కొండా దంపతులు?

nanireddy
Updated on: 24 Dec 2018 3:08 PM IST
నేడు కాంగ్రెస్ లో చేరనున్న కొండా దంపతులు?
X

మాజీ మంత్రి కొండా సురేఖ , ఎమ్మెల్సీ కొండా మురళి దంపతులు కాంగ్రెస్ లో చేరికకు రంగం సిద్ధమైంది. ఢిల్లీలో కొండా దంపతులు కాంగ్రెస్ నేత ఆజాద్ ను కలిసి అవకాశం ఉంది. నిన్న కేసీఆర్‌ కుటుంబంపై విమర్శలు చేసిన తర్వాత కొండా సురేఖ, మురళీ దంపతులు సాయంత్రానికి ఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ ఉదయం గులాం నబీ ఆజాద్‌తో వీరు భేటీ కానున్నట్లు సమాచారం. ఆజాద్‌తో భేటీ అనంతరం మధ్యాహ్నం సమయంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ సమక్షంలో వారు కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే కొండా సురేఖ
సొంతనియొజకవర్గం పరకాల నుంచి పోటీ చేస్తారా… లేక వరంగల్‌ తూర్పు నుంచి నిలబడతారా..? అలాగే సురేఖతో పాటు ఆమె కూతురు సుష్మితాపటేల్‌ పోటీ చేస్తారా.. అనేది సస్పెన్స్ గా మారింది.

nanireddy

nanireddy

Next Story