హైకోర్టు తీర్పును.. అసెంబ్లీ పాటిస్తుందా.?

x
Highlights

హైకోర్టు తీర్పుతో కోమటిరెడ్డి, సంపత్‌కు అసెంబ్లీకి రూట్ క్లియర్ అయినట్లేనా మాజీ ఎమ్మెల్యేలుగా సభ నుంచి బయటికొచ్చిన నేతలు మళ్లీ ఎమ్మెల్యేలుగా లోపల...

హైకోర్టు తీర్పుతో కోమటిరెడ్డి, సంపత్‌కు అసెంబ్లీకి రూట్ క్లియర్ అయినట్లేనా మాజీ ఎమ్మెల్యేలుగా సభ నుంచి బయటికొచ్చిన నేతలు మళ్లీ ఎమ్మెల్యేలుగా లోపల అడుగుపెడతారా..? ఇది పక్కనబెడితే.. హైకోర్టు తీర్పును.. అసెంబ్లీ పాటిస్తుందా.? గత సంఘటనలు ఏం చెప్తున్నాయ్.?

బహిష్కృత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్‌ శాసనసభ సభ్యత్వం రద్దు చెల్లదని.. ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పు... తెలంగాణ రాజకీయాల్లో కాక పుట్టిస్తోంది. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్‌పై కోమటిరెడ్డి, సంపత్ హెడ్‌ఫోన్స్ విసిరారని స్పీకర్ ఇద్దరి సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఈ వ్యవహారంలో సహజ న్యాయసూత్రాన్ని పాటించకుండా కోమటిరెడ్డి, సంపత్ సభ్యత్వంపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని కోర్టు అభిప్రాయపడింది. వీళ్లిద్దరి శాసనసభ సభ్యత్వం రద్దుపై అసెంబ్లీ ఇచ్చిన గెజిట్ రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్నా హైకోర్టు తీర్పును అసెంబ్లీ పాటిస్తుందా లేదా అన్నదే ఇప్పుడు చర్చ జరుగుతోంది.

హైకోర్టు తాజా తీర్పుతో లెజిస్లేచర్ వర్సెస్ జ్యుడిషియల్ అన్నట్లుగా తయారైంది పరిస్థితి. సభ తీసుకునే నిర్ణయాలు, స్పీకర్ విచక్షణాధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదని అసెంబ్లీ వర్గాలు చెప్తున్నాయి. గతంలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా సంపత్ కుమార్ వేసిన కేసులో ఎప్పటివరకు నిర్ణయం తీసుకుంటారో డెడ్ లైన్ చెప్పాలని స్పీకర్‌కు హైకోర్టు నోటీసులిచ్చింది. ఇది అసెంబ్లీ ప‌రిధిలోని అంశం కాబ‌ట్టి కోర్టులు డెడ్ లైన్‌లు పెట్ట‌కూడ‌ద‌నే వాద‌న‌ను కోర్టుకు వివ‌రించింది అసెంబ్లీ. సో ఇప్పుడు కూడా కో్ర్టు తీర్పును గౌరవించి కోమటిరెడ్డి, సంపత్ సభ్యత్వాలను పునరుద్ధరిస్తారా.. లేదా అన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది.

ఇప్పటికైతే.. హైకోర్టు జడ్జిమెంట్ కాపీ అసెంబ్లీ అధికారులకు చేరలేదని తెలుస్తోంది. అసెంబ్లీ లెక్కల ప్రకారం నల్గొండ, అలంపూర్ నియోజకవర్గాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. శాసనసభ సభ్యత్వం రద్దుపై హైకోర్టు తీర్పునకు సంబధించి అసెంబ్లీ అధికారులు న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకైతే కోర్టు తీర్పులను పాటించిన దాఖలాలు కూడా లేవనే చర్చ జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories