కేరళ వరదబాధితులకు సాయం ప్రకటించిన హీరోలు వీరే..

nanireddy
Updated on: 24 Dec 2018 2:41 PM IST
కేరళ వరదబాధితులకు సాయం ప్రకటించిన హీరోలు వీరే..
X

పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు కేరళ అతలాకుతలం అయింది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ కేరళలోని పలు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. మరోవైపు ఎప్పటికప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇదిలావుంటే కేరళలలోని వరద బాధితులకు సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటించారు. వారిలో హీరోలు.. కమల్‌హాసన్‌ రూ. 25లక్షలు, సూర్య, కార్తి 25లక్షలు, విశాల్ 10 లక్షలు, అల్లు అర్జున్ 25 లక్షలు, విజయ్‌ సేతుపతి 25 లక్షలు, రజనీకాంత్‌ 15 లక్షలు, ధనుష్‌ 15 లక్షలు, సిద్ధార్థ్‌ 10 లక్షలు, దర్శకుడు శంకర్‌ 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. మెగాస్టార్‌ చిరంజీవి తనవంతుగా రూ. 25 లక్షల విరాళాన్ని ప్రకటించగా.. ఆయన తనయుడు రాంచరణ్‌ రూ. 25 లక్షలు విరాళాన్ని ప్రకటించారు.. ఇక రాంచరణ్‌ సతీమణి ఉపాసన రూ. పదిలక్షల విరాళాన్ని ప్రకటించారు. అలాగే కేరళకే చెందిన హీరోయిన్‌ నయనతార కూడా 10 లక్షల రూపాయల సాయం ప్రకటించారు. మరోవైపు తమిళ నటులతో పాటు మలయాళం నటులు మోహన్‌ లాల్‌, మమ్ముట్టి, దుల్కర్‌ సల్మాన్‌ కేరళ వరద బాధితులకు తమ వంతు సహాయాన్ని ప్రకటించారు. అంతేకాకుండా మలయాళ మూవీ ఆర్టిస్ట్స్‌ (అమ్మా) 10కోట్ల రూపాయలను కేరళ సీఎం సహాయ నిధికి విరాళమిస్తున్నట్టు ప్రకటించింది.

nanireddy

nanireddy

Next Story