కేరళ వరద బాధితులకు చిన్నారితల్లి భారీ విరాళం..

రెండు వారలపాటు కేరళను వరదలు హోరెత్తించాయి . వరదల దాటికి పేద, ధనిక వర్గాలు అన్న బేధాలు లేకుండా అందరూ...
రెండు వారలపాటు కేరళను వరదలు హోరెత్తించాయి . వరదల దాటికి పేద, ధనిక వర్గాలు అన్న బేధాలు లేకుండా అందరూ బాధితులయ్యారు. భారీ వరదలతో వందలమంది ప్రాణాలు కోల్పోగా వేలమంది నిరాశ్రయులయ్యారు. ఇక నీటిలో మునిగిన ఇళ్ళకైతే లెక్కేలేదు.. ఈ క్రమంలో కేరళ వరద బాధితులకు ఆపన్నహస్తం అందించేందుకు చిన్నా పెద్దా తేడా లేకుండా ముందుకు వస్తున్నారు. ఆలా తనవంతు సాయం అందించటానికి నాలుగేళ్ల చిన్నారి ముందుకు వచ్చింది. కొంతకాలంగా తన కిడ్డీ బ్యాంకులో దాచుకున్న రూ. 14 వేల 8 వందల రూపాయలను విరాళంగా ఇచ్చేసింది. కోల్ కత్తా కు చెందిన అపరాజిత రోజూ కార్టూన్ ఛానెల్ చూసేది. అయితే ఇటీవల న్యూస్ ఛానల్ చూసి ఆశ్చర్య పోయింది. టీవిలో ఏమి జరుగుతుందమ్మా అని వాళ్ళమ్మను అడిగింది. దానికి పాప తల్లి నీలాంటి ఎంతో మంది చిన్నారులు నీటిలో చిక్కుకుని బాధపడుతున్నారని, ఆకలితో ఏడుస్తున్నారంటూ వివరించింది. దీంతో వెంటనే తన కిడ్డీ బ్యాంకులో దాచుకున్న డబ్బును తల్లిదండ్రులకు ఇచ్చి తన అక్కా చెల్లెళ్లకు వినియోగించాలని సూచించింది. దాంతో సంతోషించిన చిన్నారి తల్లిదండ్రులు జవదేవపూర్‌లో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు బీమన్ బోస్.. కేరళ వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంపునకు అపరాజితను తీసుకువెళ్లగా.. ఆమె తన పిగ్గీ బ్యాంకును ఆయనకు ఇచ్చింది.
Breaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMT
ఉద్యోగులు పెన్షనర్లకి శుభవార్త.. రిటైర్మెంట్ చేసిన వెంటనే ప్రయోజనం..!
8 Aug 2022 4:15 PM GMTRajinikanth: రాజకీయ రంగ ప్రవేశంపై తలైవా ఏమన్నారంటే?!
8 Aug 2022 4:00 PM GMTLIC New Policy: ఎల్ఐసీ అదిరే పాలసీ.. ప్రతి నెలా రూ. 2190 చెల్లిస్తే...
8 Aug 2022 3:30 PM GMTCM Jagan: ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదు..
8 Aug 2022 3:15 PM GMTవీడ్కోలు కార్యక్రమంలో వెంకయ్య భావోద్వేగ ప్రసంగం
8 Aug 2022 3:00 PM GMT