కిల్లర్ లవర్

కిల్లర్ లవర్
x
Highlights

తాను ప్రేమించిన వ్యక్తి ఎక్కడున్నా క్షేమంగా ఉండాలనుకుంటాడు నిజమైన ప్రేమికుడు కానీ వన్ సైడ్ ప్రేమతో అమ్మాయిలను వేపుకు తింటున్నారు ఇవాల్టి తరం...

తాను ప్రేమించిన వ్యక్తి ఎక్కడున్నా క్షేమంగా ఉండాలనుకుంటాడు నిజమైన ప్రేమికుడు కానీ వన్ సైడ్ ప్రేమతో అమ్మాయిలను వేపుకు తింటున్నారు ఇవాల్టి తరం ప్రేమికులు ఎదుటి వ్యక్తి అభిప్రాయంతో సంబంధం లేకుండా ప్రేమించేయడం కాదంటే కిరాతకంగా హత్య చేసే క్రిమినల్ మెంటాలిటీ ఇవాల్టి తరంలో ఎందుకు పెరుగుతోంది? ప్రేమంటే చావే అని భయపడిపోయేంత దారుణ పరిస్థితులెందుకు కలుగుతున్నాయి?

ఇదో ప్రేమికుని ఉన్మాదం తనను కాదన్న కారణంగా నిర్దాక్షిణ్యంగా ఓ ఆడకూతురు ప్రాణాలు తీసిన కర్కశత్వం పట్టుమని పాతికేళ్లయినా లేని వయసు చదువులేక అడ్డదారులు తొక్కిన బాల్యం పెళ్లీడు వయసురాగానే ఆడపిల్లలపై కన్నేయడం కాదన్నందుకు దారుణంగా హత్య చేయడం ఇదీ సంధ్యారాణి హత్య కేసులో నిందితుడు కార్తీక్ నేపధ్యం చదువుకుని, చక్కగా ఉద్యోగం చేయాల్సిన వయసులో అల్లరి చిల్లరగా తిరుగుతూ సమాజానికే ఒక ప్రశ్నగా మారాడు కార్తీక్ స్నేహం చేసిన వ్యక్తికే ద్రోహం చేశాడు కార్తీక్ కేవలం ప్రేమ పిచ్చితో అమాయకురాలిని కిరాతకంగా కాల్చి చంపి ఇప్పుడు బోనులో నిలబడ్డాడు తన ప్రేమను తిరస్కరించిందన్న కారణంగా సంధ్యారాణి అనే సహోద్యోగిని కిరోసిన్ పోసి దారుణంగా కాల్చేశాడు ఆడపిల్ల ఉసురు తీసి, నీచమైన, హేయమైన పనికి పాల్పడి అటు తల్లి దండ్రులకూ తలవొంపులు తెచ్చాడు.

ప్రేమను తిరస్కరిస్తే చావేనా? ఎదుటి వ్యక్తికి తన అభిప్రాయం తెలిపే హక్కు ఉండదా? తన ప్రేమను అంగీకరించాలన్న మూర్ఖత్వం ఎందుకు? ఇలాంటి మనస్తత్వం ఒక్క కార్తీక్ దే కాదు ఈ సమాజంలో చాలా మంది మగపిల్లలది అదే ఉన్మాదం చదువు లేని ఆవారాగాళ్లే కాదు చదువు, సంస్కారం ఉన్న మగవాళ్లలోనూ ఈ ధోరణి ఎక్కువవుతోంది. ఆడపిల్లంటే ఒక ఆటవస్తువనో అభిప్రాయాలు, వ్యక్తిత్వం లేని మర యంత్రంగానో ఈతరం మగపిల్లలు భావిస్తున్నారా?

సహోద్యోగిని ప్రేమించడం తప్పు కాదు కానీ ఆ ప్రేమను కాదనే హక్కూ ఎదుటి వ్యక్తికి ఉంటుందని ఇంగితం తెలియని ఆవారాతనం ఆ హంతకుడి సొంతం ప్రేమను నిరాకరించిందన్న కారణంగా బంగారం లాంటి అమ్మాయిని అత్యంత కిరాతకంగా కిరోసిన్ పోసి కాల్చి చంపాడు. బాధతో విలవిల్లాడుతూ ఆ అమ్మాయి పరుగులు తీస్తే ఈ మృగానికి కనీసం పశ్చాత్తాపం కలగలేదు కనీసం మంటలార్పేద్దామన్న ప్రాయశ్చిత్తం కలగలేదు తాము ప్రేమించిన వారు తిరిగి తమని ప్రేమించకపోతే తట్టుకోలేరా? నమ్మించి, ప్రేమను తిరస్కరిస్తే ఆ కోపాన్ని ప్రదర్శించడానికి ఇంకా చాలా మార్గాలున్నాయి తన అసహనాన్ని బయటపెట్టడానికి ఎన్నో దారులున్నాయి కానీ ఒక ప్రాణాన్ని చిదిమేసే హక్కు ఆ ఉన్మాదికి ఎవరిచ్చారు? అదే ఆడపిల్ల తిరగబడి అదే పనిచేస్తే తట్టుకునే శక్తి ఉంటుందా? మనిషి ప్రాణం విలువ తెలియని మూర్ఖుడు కార్తీక్ కార్తీక్ ప్రవర్తన అతగాడి తల్లి దండ్రులకే తలవొంపులు తెచ్చి పెట్టింది. ప్రేమన్నది వన్ సైడ్ వ్యవహారం కాదని ప్రేమను తిరస్కరిస్తే ఇక జీవితమే లేదని భ్రమించే కార్తీక్ లాంటి వాళ్లకు కనువిప్పు కలగాలంటే ఏం చేయాలి?నిజమైన ప్రేమకు ఓటమిని భరించే శక్తి కూడా ఉంటుందన్న విషయం తెలియాలంటే ఇలాంటి మూర్ఖులు ఎన్ని జన్మలెత్తాలి?

Show Full Article
Print Article
Next Story
More Stories