ఉద్యమాల ఖిల్లాలో సీట్ల లొల్లి!!

ఉద్యమాల ఖిల్లాలో సీట్ల లొల్లి!!
x
Highlights

ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లాలో ఎన్నికల రాజకీయం రసకందాయకంగా సాగుతోంది. టిఆర్ఎస్‌ను ఓడించేందుకు మహాకుటమిగా ఏర్పడిన విపక్షాలు, సీట్ల సర్థుబాటులో తలోదారి...

ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లాలో ఎన్నికల రాజకీయం రసకందాయకంగా సాగుతోంది. టిఆర్ఎస్‌ను ఓడించేందుకు
మహాకుటమిగా ఏర్పడిన విపక్షాలు, సీట్ల సర్థుబాటులో తలోదారి వ్యవహరిస్తూ, మొదటికే మోసం వచ్చేలా చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలోని పది సీట్ల విషయంలో స్పష్టత లేకపోవడం...ఖమ్మం సీటుపై ఎవరికి వారే ఎమునాతీరే అన్న చందంగా ఉండటం, సర్వత్రా చర్చనీయాంశమైంది. ఖమ్మంలో సీట్ల కొట్లాట, చివరికి ఎలాంటి మలుపు తిరుగుతుంది? అధికార టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు ఏర్పడిన కూటమిలో చిటపటమొదలైంది. సీట్ల సర్దుబాటు విషయంలో అంగీకారం రాకపోవడంతో,
జిల్లాస్థాయిలోనూ కుతకుతలు విన్పిస్తున్నాయి. ప్రతీ జిల్లాకు ఒక సీటు కావాలని తెలంగాణ జనసమితి డిమాండ్‌ చేస్తోంది. టీడీపీ
నాలుగు పైగా సీట్లు కోరుతోంది. సీపీఐ కూడా మొదట్లో మూడు సీట్లు అడిగినప్పటికీ ఆ తర్వాత కొత్తగూడెం, వైరా సీట్లపై ఆశలు పెట్టుకుంది.
కాంగ్రెస్‌ సీట్ల సర్దుబాటు విషయంలో తేల్చకపోవడంతో, పరిస్థితిని గ్రహించిన సీపీఐ, కాంగ్రెస్‌పై భగ్గుమంటోంది.

ఖమ్మం జిల్లాలో సీపీఐకి పది
నియోజకవర్గాల్లోనూ ఓటు బ్యాంకు ఉంది. ప్రధాన పక్షాలు పోటా పోటీ ఉన్న చోట ఫలితాలను తారుమారుచేసే శక్తి సీపీఐకి ఉంది. దీంతో
ఆ పార్టీ సీట్ల విషయంలో తేల్చని పక్షంలో, పది నియోజకవర్గాల్లో పోటీ చేయాలన్న ఆసక్తితో ఉంది. ఒకవేళ అన్ని చోట్లా కాకపోయినా కాంగ్రెస్‌
ముఖ్య నేతలు పోటీ చేసే నియోజకవర్గాలను టార్గెట్‌ చేసుకుని తమ ఓటు బ్యాంకు, ప్రత్యర్థి పార్టీకి పరోక్షంగా బదిలీ చేయడమా లేక
నిలబడి ఓటు బ్యాంకును చీల్చడమా అనే కోణాల్లో ఆ పార్టీ నేతలు ఆలోచిస్తున్నారు.
జిల్లాలో ఖమ్మం, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట స్థానాలను టీడీపీ డిమాండ్‌ చేస్తోంది. నాలుగింటిలో మూడు సీట్లు ఆ పార్టీకి
ఇస్తారన్న ప్రచారం ఉంది. సత్తుపల్లి, అశ్వారావుపేట విషయంలో కాంగ్రెస్‌ నుంచి అభ్యంతరం లేకపోయినా కొత్తగూడెం, ఖమ్మం సీట్ల
విషయంలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీని ఖమ్మం సీటు బదులు పాలేరు సీటు తీసుకోవాలన్న ప్రతిపాదన కాంగ్రెస్‌
నుంచి వస్తున్నట్టు సమాచారం. ఓవైపు రేణుకా చౌదరి మరోేవైపు నామా
నాగేశ్వరరావు ఖమ్మం టికెట్ విషయంలో పట్టువిడుపు లేకుండా వ్యవహరించడంతో ఇపుడు రాష్ట్రంలోని అన్ని పార్టీల ద్రుష్టి ఖమ్మం రాజకీయాలపై
పడింది. తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం సొంత పార్టీ కేడర్‌ డిమాండ్‌ను కాదనలేక, మిత్రపక్షంలో కలిసిన టీడీపీ, సీపీఐ
సీట్ల ప్రతిపాదనలను తేల్చలేక అడకత్తెరలో పావు చెక్కలా నలుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories