రైతుల ఆత్మహత్యలు బాధాకరం
హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా చేస్తే అభ్యంతరం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో ఇండియా టుడే...
హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా చేస్తే అభ్యంతరం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో ఇండియా టుడే కాన్ క్లేవ్‌లో మాట్లాడిన కేసీఆర్...దేశ ప్రజలు కోరుకుంటే హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా చేయడాన్ని స్వాగతిస్తానన్నారు. తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని కేసీఆర్ అన్నారు. సొంత ఆర్థిక వనరులతో గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు కంటే ముందజలో ఉందని చెప్పారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ అభివృధ్ధి చెందడంతో పాటు దేశాభివృద్ధికి తోడ్పాటునందిస్తోందని అన్నారు.
తెలంగాణ చిన్న రాష్ట్రం కాదు : కేసీఆర్
తెలంగాణ చిన్న రాష్ట్రం కాదని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ కంటే 17 చిన్న రాష్ట్రాలున్నాయని...పశ్చిమ బెంగాల్, బీహార్ కంటే కూడా భౌగోళికంగా పెద్దదని చెప్పారు. తెలంగాణ ఏర్పడితే నిలదొక్కుకోవడం ఖాయమని అన్ని పార్టీలవారిని ఒప్పించి.. కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి విషయంలో అబద్ధపు ప్రచారాలు జరిగాయని... కానీ తెలంగాణ ఏర్పడిన ఆరు నెలలకే పరిశ్రమలకు 24 గంటలు, వ్యవసాయానికి 10 గంటలు విద్యుత్ ఇచ్చామని వివరించారు. 2020 నాటికి తెలంగాణ మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంగా ఎదుగుతుందని కేసీఆర్ అన్నారు.
రైతుల ఆత్మహత్యలు బాధాకరం
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు బాధాకరమని కేసీఆర్ అన్నారు. అన్నదాలతో పాటు చేనేత కార్మికులు కూడా ప్రాణాలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యల నివారణకి గానూ ఏటా 40 వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఆసరా పెన్షన్లను 2 వందల నుంచి 2 వేలకు పెంచడంతో పాటు దివ్యాంగులకు 15 వందల పింఛను ఇస్తున్నామని కేసీఆర్ వివరించారు. అలాగే రేషన్ షాపుల ద్వారా నెలకు మనిషికి 6 కేజీల బియ్యం సరఫరా చేస్తున్నామని తెలిపారు.
లైవ్ టీవి
సీఎం జగన్‌కు రాఖీలు కట్టిన మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులు
12 Dec 2019 8:34 AM GMTగొల్లపూడి మృతిపట్ల దిగ్భాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్
12 Dec 2019 8:26 AM GMTఆర్టీసీ చార్జీలు పెంపుదల నిరసిస్తూ టీడీపీ శ్రేణులు ఆందోళన
12 Dec 2019 8:13 AM GMTబ్రేకింగ్: ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు కన్నుమూత
12 Dec 2019 7:57 AM GMTఅమ్మరాజ్యంలో కడప బిడ్డలు ఎలా ఉందంటే.. ట్విట్టర్ రివ్యూలు
12 Dec 2019 7:53 AM GMT