బిగ్ బ్రేకింగ్ : కత్తి మహేష్ ను నగరంనుంచి బహిష్కరించిన పోలీసులు.. స్వామి పరిపూర్ణానందను..

nanireddy
Updated on: 24 Dec 2018 1:56 PM IST
బిగ్ బ్రేకింగ్ : కత్తి మహేష్ ను నగరంనుంచి బహిష్కరించిన పోలీసులు.. స్వామి పరిపూర్ణానందను..
X

కత్తి మహేష్‌ రాముడిపై చేసిన వ్యాఖ్యలతో మరో వివాదం రాజుకుంది. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఆందోళనలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో అయన వ్యాఖ్యలకు నిరసనగా స్వామి పరిపూర్ణానంద నిరసన తెలుపుతున్నారు. దీంతో హైదరాబాద్‌లో ఉద్రిక్తతలు తలెత్తకుండా.. కత్తి మహేష్, స్వామి పరిపూర్ణానంద వార్‌పై పోలీసులు దృష్టిసారించారు. స్వామి పరిపూర్ణానందను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు, కత్తి మహేష్‌ను నగరం నుంచి బహిష్కరించారు. ఈ మేరకు కత్తి మహేష్‌ను అదుపులోకి తీసుకున్న తెలంగాణ పోలీసులు.. ఆయనను ఏపీ పోలీసులకు అప్పగించారు. అనుమతి లేకుండా మళ్లీ హైదరాబాద్‌ రావొద్దని ఆదేశించారు.

nanireddy

nanireddy

Next Story