ప్లీజ్ కత్తి మా పవన్ కల్యాణ్ ని వదిలిపెట్టవా : పవన్ కల్యాణ్ ఫ్యాన్స్

lakshman
Updated on: 24 Dec 2018 12:25 PM IST
ప్లీజ్ కత్తి మా పవన్ కల్యాణ్ ని వదిలిపెట్టవా : పవన్ కల్యాణ్ ఫ్యాన్స్
X

ప్లీజ్ కత్తి మా పవన్ కల్యాణ్ ని వదిలిపెట్టవా అంటూ కామెంట్ చేస్తున్నారు. కొద్ది రోజులుగా పవన్ కల్యాణ్ పాలిటిక్స్ ను వ్యతిరేకించిన క్రిటిక్ కత్తిమషేష్ తాజాగా అజ్ఞాతవాసి ఆడియో లాంచ్ పై మండిపడ్డారు. పవన్ అజ్ఞాతవాసి సినిమా అయిపోయింది. బిజినెస్ బాగా జరిగింది. ఇక ఏపీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడు. "పాలిటిక్స్‌ గురించి క్లారిటీ రాలేదు సరే.. ఇప్పుడు సినిమాల మీద ఉన్న క్లారిటీ పోయినట్లు ఉందే.. కొన్ని వీడియోల్నీ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.

అయితే ఆ వీడియోలపై స్పందించిన పవన్ ఫ్యాన్స్ ...పవన్ కల్యాణ్ వల్లే తామ మిన్నుకుండిపోతున్నామని లేదంటే హెచ్చరికల తప్పదని అన్నారు. ఆయన తీసేసిన గోరు దొరికితే కళ్లకు అద్దుకుంటాం . అలాంటి ఆయనపైనే కామెంట్లు చేస్తే ఎలా ఊరుకుంటామని రిప్లైయ్ ఇచ్చారు.

అంతేకాదు అశ్లీలంగా నటించే వారి గురించి మీరు ఎందుకు మాట్లాడడం లేదు. అప్పుడు నీ కళ్లు ఏమయ్యాయని వారు మహేష్ కత్తిపై విరుచుకుపడ్డారు. నీకు ఎవరు డబ్బులు ఇస్తున్నారు, చందాలు వేసుకుని మేం ఇస్తాం, మా పవన్ కల్యాణ్‌ను వదిలిపెట్టు, ప్లీజ్ అని అన్నారు.

lakshman

lakshman

Next Story