సీఎంలకు జెండా ఎగరేసే హక్కు కరుణ వల్లే దక్కింది

సీఎంలకు జెండా ఎగరేసే హక్కు కరుణ వల్లే దక్కింది
x
Highlights

తమిళ రాజకీయాల్లో ఎదురులేని మహానేత. ద్రావిడ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన పోరాట యోధుడు. నా జాతే నా జాతీయత అని చాటి చెప్పిన మహనీయుడు కరుణానిధి. పార్టీ...

తమిళ రాజకీయాల్లో ఎదురులేని మహానేత. ద్రావిడ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన పోరాట యోధుడు. నా జాతే నా జాతీయత అని చాటి చెప్పిన మహనీయుడు కరుణానిధి. పార్టీ పేరులో నుంచి ద్రవిడ అనే పదాన్ని తొలగించాలని ఒత్తిడి వచ్చినా వెనక్కి తగ్గలేదు. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలకు ప్రాధాన్యత కల్పించాలంటూ కరుణానిధి ఎనలేని పోరాటం చేశారు. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలని చివరి వరకు ఆకాంక్షించారు. రాష్ట్రాల హక్కుల కోసం నిర్విరామంగా కృషి చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజు ముఖ్యమంత్రులే ఆయా రాష్ట్రాల్లో జాతీయ జెండా ఎగురవేయాలని నినదించారు.

కరుణానిధికి మరికొందరు ముఖ్యమంత్రులు జతకలవడంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే జాతీయ జెండా ఎగురవేసేలా కేంద్రం ఆదేశాలిచ్చింది. అంతేకాదు కరుణానిధి తమిళనాడు కోసం ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రాంతీయ పార్టీలను నిషేధించే అవకాశం ఉందనే భయాలు ఏర్పడ్డాయి. డీఎంకే పార్టీ పేరులోని ద్రవిడ అనే పదాన్ని తొలగించాలని వీ ఆర్ నెడుంచెజియన్ వంటి నేతలు సలహా ఇచ్చినా వెనక్కి తగ్గలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories