హైదరాబాద్‌లో కర్నాటకం... ఏం జరగబోతోంది?

హైదరాబాద్‌లో కర్నాటకం... ఏం జరగబోతోంది?
x
Highlights

కర్ణాటక విపక్ష ఎమ్మెల్యేల క్యాంపు రాజకీయం హైదరాబాద్, కొచ్చికి చేరింది. కర్ణాటక సీఎం యడ్యూరప్ప బారి నుంచి ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి...

కర్ణాటక విపక్ష ఎమ్మెల్యేల క్యాంపు రాజకీయం హైదరాబాద్, కొచ్చికి చేరింది. కర్ణాటక సీఎం యడ్యూరప్ప బారి నుంచి ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కాంగ్రెస్-జేడీఎస్ అర్థరాత్రి హడావిడిగా మకాం మార్చేశాయి. అత్యంత పకడ్బందీగా రాత్రిపూట కాంగ్రెస్ - జేడీఎస్ శాసన సభ్యులను హైదరాబాద్, కొచ్చికి తరలించాయి. కర్ణాటక రాజకీయం మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్, జేడీఎస్ కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నాయి. జేడీఎస్ ఎమ్మెలుఉన్న ఈగిల్టన్‌ రిసార్ట్‌, కాంగ్రెస్‌‍ ఎమ్మెల్యేలను ఉంచిన షాంగ్రిలా హోటల్ దగ్గర యడ్యూరప్ప ప్రభుత్వం భద్రతను ఉపసంహరించడంతో అధికారం కోసం ఎదురు చూస్తున్న రెండు పార్టీలు అలర్ట్ అయ్యాయి. పోలీసుల ద్వారా దాడులు చేయించి, ఎమ్మెల్యేలను విడిపిస్తారనే అనుమానం రావడంతో అర్థరాత్రిపూట ఈగిల్టన్‌ రిసార్ట్‌, షాంగ్రిలా హోటల్‌ను ఖాళీ చేసేశాయి. ఎమ్మెల్యేలను బస్సుల్లోనూ ఇతర వాహనాల్లోనూ తరలించాయి.

కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలందర్నీ కొచ్చిలో క్రౌన్ ప్లాజా హోటల్‌కు తరలించాలని జేడీఎస్ , కాంగ్రెస్ నేతలు భావించారు. ఎమ్మెల్యేలను చార్టెడ్ ఫ్లైట్‌లో కొచ్చి తీసుకెళ్ళాలని చూశారు. కానీ చార్టెడ్ ఫ్లైట్‌‌కి విమానయాన శాఖ అనుమతి నిరాకరించడంతో బస్సుల్లోనే...కొందర్ని హైదరాబాద్‌‌కు.. మరికొందర్ని కొచ్చికి తరలించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన ఎమ్మెల్యేలు హైదరాబాద్ హైవేపై ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులోకి మారుతూ కెమేరాకి దొరికారు. గత అనుభవాల దృష్ట్యా ఎమ్మెల్యేలను బెంగళూరు నుంచి తరలించినట్లు కుమార స్వామి తెలిపారు. శాసన సభ్యులను ప్రలోభపెడతారనే భయం లేదని కుమార స్వామి చెప్పుకొచ్చారు. అయితే బేరసాలకు అవకాశం లేకుండానే ముందస్తు జాగ్రత్తగా వారిని తరలించినట్లు వివరించారు.

మరోవైపు కర్ణాటకలో బీజేపీకి అనుకూలంగా వ్యవహరించి యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్ వజుభాయ్ వాలా నిర్ణయానికి వ్యతిరేకంగా ఇవాళ కాంగ్రెస్ దేశ్యాప్తంగా రాష్ట్రాల రాజధాని నగరాల్లో ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. అటు కర్ణాటక గవర్నర్‌పై ఫిర్యాదు చేయడానికి రేపు విపక్షాలకు చెందిన ముఖ్య నాయకులు రాష్ట్రపతి కోవింద్‌ను కలవాలని నిర్ణయించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories