కర్ణాటకలో అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్‌

కర్ణాటకలో అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్‌
x
Highlights

వచ్చే నెలలో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చే అవకాశాలు లేవని తాజా సర్వేలు చెబుతున్నాయ్. ఇండియా టుడే-కార్వీ...

వచ్చే నెలలో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చే అవకాశాలు లేవని తాజా సర్వేలు చెబుతున్నాయ్. ఇండియా టుడే-కార్వీ ఇన్‌సైట్స్‌ ఓపినియన్‌ పోల్స్‌లో కాంగ్రెస్ పార్టీ వందకు పైగా సీట్లు సాధిస్తుందని సర్వేలో తేలింది.

వచ్చే నెలలో జరిగే కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీకీ సంపూర్ణ మెజార్టీ సాధించే అవకాశాలు లేవు. ఇండియా టుడే - కార్వీ ఇన్‌సైట్స్ ఒపీనియన్ పోల్స్‌ అంచనా ప్రకారం అధికార కాంగ్రెస్‌ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని సర్వేలో తేలింది. బీజేపీ రెండో స్థానం, జేడీఎస్ మూడో స్థానంలో నిలుస్తాయని ఓపీనియన్‌ పోల్స్‌లో తేలింది. ఈ సర్వేను నెల క్రితం నిర్వహించినట్లు ఇండియా టుడే - కార్వీ ఇన్‌సైట్స్‌ తెలిపాయి.

రాష్ట్రం మొత్తం మీద కాంగ్రెస్‌కు 37 శాతం, బీజేపీకి 35 శాతం, జేడీఎస్-బీఎస్‌పీ కూటమికి 19 శాతం ఓట్లు లభించే అవకాశం కనిపిస్తోంది. 224 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఏ పార్టీకైనా 112 సీట్లు తప్పనిసరి. ఇండియా టుడే - కార్వీ ఇన్‌సైట్స్ ఒపీనియన్ పోల్ ఫలితాల ప్రకారం వచ్చే నెలలో జరిగే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 90 నుంచి 101 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. బీజేపీకి 78 నుంచి 86 స్థానాలు దక్కే అవకాశాలున్నాయ్. జేడీఎస్-బీఎస్‌పీ కూటమికి 34 నుంచి 43 స్థానాలు వస్తాయని ఒపినియన్‌ పోల్‌లో తేలింది. ప్రస్తుత ఒపినియన్ పోల్స్‌ చూస్తుంటే జేడీఎస్-బీఎస్‌‌పీ కూటమి కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయ్.

Show Full Article
Print Article
Next Story
More Stories