గెలుపెవరిది? కన్నడ యుద్ధంపై హెచ్‌ఎంటీవీ గ్రౌండ్‌ రిపోర్ట్‌!!

గెలుపెవరిది? కన్నడ యుద్ధంపై హెచ్‌ఎంటీవీ గ్రౌండ్‌ రిపోర్ట్‌!!
x
Highlights

224 స్థానాలు. 3 వేల 374 మంది అభ్యర్థులు. నాలుగు కోట్ల 96 లక్షల ఓటర్లు. వందల కోట్ల బెట్టింగ్. హీటెక్కించే ట్వీట్లు. ఆవేశం రగిలే ప్రసంగాలు. వెరసి...

224 స్థానాలు. 3 వేల 374 మంది అభ్యర్థులు. నాలుగు కోట్ల 96 లక్షల ఓటర్లు. వందల కోట్ల బెట్టింగ్. హీటెక్కించే ట్వీట్లు. ఆవేశం రగిలే ప్రసంగాలు. వెరసి కర్ణాటక ఎన్నికల రణం. రెండు జాతీయ పార్టీల చావోరేవో యుద్ధం. మరి కన్నడ నాడి ఏం చెబుతోంది....కన్నడ పోరు గడ్డపై అడుగుపెట్టి హెచ్ఎంటీవీ, అక్కడి ప్రజల మనోగతమేంటో తెలుసుకునే ప్రయత్నం చేసింది...కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై హెచ్‌ఎంటీవీ గ్రౌండ్‌ రిపోర్ట్‌ చూద్దామా?

కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రెండు అతిపెద్ద రాష్ట్రాల్లో పంజాబ్‌ తర్వాత, పెద్ద రాష్ట్రం కర్ణాటకనే. ఇక కాంగ్రెస్‌ ముక్త్ భారత్‌ అంటూ చెలరేగిపోతున్న బీజేపీ, కన్నడ గడ్డ నుంచి కూడా ముక్త్ చేయాలని సకల వ్యూహాలూ వేస్తోంది. కర్ణాటకను నిలబెట్టుకోవాలని కాంగ్రెస్, చేజిక్కించుకోవాలని బీజేపీలు, అనేక వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. మధ్యలో పవర్‌ ప్లే చేయాలని జేడీఎస్‌ చూస్తోంది. మరి పవర్‌ కోసం పార్టీలు ప్రయోగిస్తున్న అస్త్రాలేంటి, పబ్లిక్‌ పల్స్‌ ఏంటి...కర్ణాటక గ్రౌండ్‌ జీరో నుంచి హెచ్‌ఎంటీ స్పెషల్‌ రిపోర్ట్. లెట్స్ స్టార్ట్‌ ది పొలిటికల్ జర్నీ.

బాగేపల్లి, అనంతపురం జిల్లా సరిహద్దులో ఉండే ప్రాంతం. పేరుకే అది కర్ణాటక రాష్ట్రమైనా, ఇక్కడ దాదాపు 90 శాతం ప్రజలు మాట్లాడేది తెలుగే. కర్ణాటకలో ఎంటరయ్యే ముందు, హెచ్‌ఎంటీవీ మొదట అడుగుపెట్టింది బాగేపల్లిలోనే. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రముఖ నటుడు సాయికుమార్‌ బరిలో నిలిచారు....మరి బాగేపల్లిలో పోటీ ఎలా ఉంది...బాగేపల్లిలో గెలుపును నిర్దేశించి ప్రాధాన్య అంశాలేంటి...జనం ఏమంటున్నారు...ఆ ఊరి సమస్యలేంటి....

బాగేపల్లి నుంచి బెంగళూరు బాటలో సాగిపోయింది హెచ్‌ఎంటీవీ. ఆ మహానగర ఓటర్ల నాడి పట్టే ప్రయత్నం చేసింది. తెలుగు ప్రజలను పలకరించింది. ఇంతకీ ఇండియన్‌ సిలికాన్ వ్యాలీలో పబ్లిక్‌ ఒపీనియన్ ఏంటి...కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్‌లలో ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు? తెలుగు ప్రజల నాడీ ఏంటో చూశాం. పెద్ద సంఖ్యలో ఉన్న తెలుగు ఓటర్లను ఆకర్షించేందుకు, తెలుగు రాష్ట్రాల నుంచి నాయకులు కూడా కన్నడగడ్డపై అడుగుపెట్టారు. ఎక్కడ తెలుగు జనం ఉంటే, అక్కడ వాలిపోతున్నారు. కర్ణాటకలో ప్రచారం సాగిస్తున్న తెలుగు నాయకులనూ పలకరించింది హెచ్‌ఎంటీవీ. అన్ని పార్టీల ప్రధాన కార్యాలయాల దగ్గరకూ వెళ్లింది, లీడర్లతో మాట్లాడింది. మే 12న కర్ణాటకలో పోలింగ్ జరగబోతోంది. 15న ఫలితాలు రాబోతున్నాయి...మరి గెలిచేదెవరు...కర్ణాటక సింహాసనంపై కూర్చోనెదెవరో ఆ రోజే తేలిపోతుంది...ఎన్నికల రోజు, ఫలితాల రోజు, కర్ణాటక పోలింగ్ ట్రెండ్స్‌ ఏంటో ఎప్పటికప్పుడు మీకందిస్తూనే ఉంటుంది హెచ్‌ఎంటీవీ.

Show Full Article
Print Article
Next Story
More Stories