తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటక ఎన్నికల ఫీవర్

తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటక ఎన్నికల ఫీవర్
x
Highlights

తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటక ఫీవర్ పట్టుకుంది. కర్ణాటక ఎన్నికలు , ఫలితాలపై ఏపీ, తెలంగాణలో టెన్షన్ మొదలైంది. కర్ణాటకలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం...

తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటక ఫీవర్ పట్టుకుంది. కర్ణాటక ఎన్నికలు , ఫలితాలపై ఏపీ, తెలంగాణలో టెన్షన్ మొదలైంది. కర్ణాటకలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంలో ఇక్కడి నేతల్లో గుబులు కనిపిస్తోంది. ఇంతకీ కర్ణాటక ఎన్నికలకు తెలుగు రాష్ట్రాలకు సంబంధం ఏమిటనేగా డౌట్.

కర్ణాటకలో అధికారం నిలుపుకోవడానికి కాంగ్రెస్ పట్టుదలగా ఉంటే., కన్నడనాటలో పాగా వేసి దక్షిణ భారతదేశంలో ఖాతా తెరవాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. అయితే కర్ణాటకలో తెలుగు వారి ప్రభావం ఎక్కువ. దాదాపు 35 శాసనసభా స్థానాల్లో తెలుగువారి ఓట్లే కీలకం. వారిని ఎలాగైనా తమవైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ , బీజేపీ వ్యూహాలు పన్నుతున్నాయి. ఫైగా కర్ణాటకలో గెలిస్తే తెలంగాణలో అధికారానికి చేరువైనట్లేనని హస్తం , బీజేపీ నేతలు లెక్కలేసుకుంటున్నారు. దీంతో కర్ణాటక తెలుగు వారి మనసు గెలుకుకునేందుకు తెలుగు కాంగ్రెస్, బీజేపీ నేతలు పక్కరాష్ట్రం బాట పట్టారు.

కర్నాటకలో బీజేపీని ఓడిస్తే ...మోడీ పతనం ప్రారంభమైనట్లేనని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. అందుకే తెలంగాణ నేతలు కర్ణాటక ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు. ఇక కర్ణాటకలో తెలుగు ప్రజల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఏపీ, తెలంగాణ బీజేపీ కార్యకర్తలు ఇప్పటికే మకాం వేశారు. మూడు నెలలుగా 70 మంది అక్కడ ప్రచారం చేస్తున్నారు. బీజేపీ సీనియర్ నేతలు కూడా కర్ణాటక ప్రచారంలో పాల్గొనడానికి త్వరలో వెళ్తారు.

జాతీయపార్టీల పరిస్థితి అలా ఉంటే..తెలుగుదేశం, టీఆర్ఎస్ కూడా ఇప్పటికే కర్ణాటక ఎన్నికల్లో తమ వైఖరి ఏంటో ప్రకటించేశాయి. ఈ రెండు అధికార పార్టీలు బీజేపీ వ్యతిరేక ప్రకటనలు చేశాయి. ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన బీజేపీని ఓడించాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. ఇప్పటికే కొందరు ముఖ్య నేతలు అక్కడ ప్రచారం కూడా చేశారు. ఇక టీఆర్ఎస్ కర్ణాటక ప్రాంతీయ పార్టీ అయిన జేడిఎస్‌కు మద్దతు ప్రకటించింది. అయితే టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా..కర్ణాటకలో బీజేపీ గెలుపును అడ్డుకోలేరని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories