కేంద్ర మంత్రి పదవికి త్వరలో జేపీ నడ్డా రాజీనామా..?

nanireddy
Updated on: 24 Dec 2018 12:24 PM IST
కేంద్ర మంత్రి పదవికి త్వరలో జేపీ నడ్డా రాజీనామా..?
X

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి పదవికి జగత్ ప్రకాష్ నడ్డా రాజీనామా చేస్తారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి.. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అనుకున్న ప్రేమ్ కుమార్ ధుమాల్ ఓటమి చెందటంతో, ఆ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి జేపీ నడ్డాను సీఎం చేయాలనీ బీజేపీ అధిష్టానం భావిస్తునంట్టు విశ్వసనీయంగా తెలుస్తుంది.. దీనిపై కొద్దీసేపటి క్రితమే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, నడ్డాతో ఫోనులో మాట్లాడారనే వార్త చక్కర్లు కొడుతుంది.. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీతో అధికారం దిశగా అడుగులు వేస్తున్న వేళ ఆ పార్టీకి ధుమాల్ ఓటమి షాక్ ఇచ్చిందనే చెప్పాలి.. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ముఖ్యమంత్రి రేసులోకి బీజేపీ తీసుకువచ్చినట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు.. అంతేకాదు రాబోయే రెండు మూడు రోజుల్లోనే మంత్రి పదవికి నడ్డాను రాజీనామా చేయించి హిమాచల్ ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలనీ బీజేపీ భావిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్..

nanireddy

nanireddy

Next Story