జయ మృతి కేసు లో కొత్త మలుపు..!

nanireddy
Updated on: 24 Dec 2018 12:23 PM IST
జయ మృతి కేసు లో కొత్త మలుపు..!
X

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసులో కొత్త మలుపు చోటుచేసుకుంది.. జయను ఊపిరాడని స్థితిలోనే ఆసుపత్రికి తీసుకొచ్చారని అపోలో ఆసుపత్రుల వైస్ చైర్‌పర్సన్ ప్రీతారెడ్డి తెలిపారు. ఓ తమిళ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సెప్టెంబరు 12 రాత్రి జయ ఊపిరాడని స్థితిలోనే చేరారని తెలిపారు. ‘‘ఊపిరాడని స్థితిలో ఉన్న జయను ఆసుపత్రికి తీసుకొచ్చారు. తక్షణం సరైన చికిత్స అందించడంతో కోలుకున్నారు’’ అని ఆమె పేర్కొన్నారు. అయితే దురదృష్టవశాత్తు చివరికి ఫలితం మాత్రం అందరూ ఊహించినట్టుగా కాకుండా వేరేలా వచ్చిందన్నారు. కాగా జయలలిత మరణంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపడుతుండటం తెలిసిందే..

nanireddy

nanireddy

Next Story