వారెవ్వా.... రాజకీయానికి చెంపదెబ్బ అంటే ఇదీ!!

వారెవ్వా.... రాజకీయానికి చెంపదెబ్బ అంటే ఇదీ!!
x
Highlights

ఆ గ్రామంలో అంబేడ్కర్‌ సూక్తి ఆలోచింపజేస్తుంది. ఎన్నికల వేళ సరికొత్త ఆలోచనను రేకెత్తిస్తోంది. రాజకీయ నాయకుల వక్రబుద్ధికి బెండ్‌ కావొద్దంటూ ఏర్పాటు...

ఆ గ్రామంలో అంబేడ్కర్‌ సూక్తి ఆలోచింపజేస్తుంది. ఎన్నికల వేళ సరికొత్త ఆలోచనను రేకెత్తిస్తోంది. రాజకీయ నాయకుల వక్రబుద్ధికి బెండ్‌ కావొద్దంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ... ఓటు పట్ల ప్రజల్లో ఉన్న అవగాహనను, ఇతరులకు చైతన్యాన్ని కలిగిస్తోంది.తెలంగాణలో ఎలక్షన్ల లొల్లి మొదలైంది. ఒక్కొక్క పార్టీ నుంచి ముడుపులు, మద్యం బాటిళ్ళు. కానుకలు ఓటర్లకు ముట్టజెబుతుంటారు రాజకీయ నాయకులు. ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని లేని లేని జిమ్మిక్కులకు పాల్పడుతుంటారు వివిధ పార్టీలవాళ్ళు. ఈ క్రమంలో ఎవరికి ఓటు వెయ్యాలి ? అనే డైలమాలో ఓటర్లు వుంటారు.

అలాంటి డైలమాలు, కన్ఫ్యూజన్‌లకు ఆస్కారం లేకుండా జనగామ జిల్లా కోమళ్ల వాసి ఓ వినూత్న ప్రచారానికి తెరలేపాడు. తన గోడ మీద తాటికాయంత అక్షరాలతో రాసి చాలా మంది రాజకీయ నాయకుల వక్రబుద్ధికి ఆయిల్ రాస్తున్నాడు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమళ్ల గ్రామానికి చెందిన తాళ్లపల్లి వెంకటస్వామి తన ఇంటి గోడపై ఈ ఇంటి ఓట్లు అమ్మబడవు అని రాయించాడు. దీంతో పాటు నా జాతి ప్రజలకు కత్తి చేతికివ్వలేదు.. ఓటు హక్కు ఆయుధంగా ఇచ్చాను.. పోరాడి రాజులౌతారో.. అమ్ముడుపోయి బానిసలు అవుతారో నిర్ణయం మీ చేతిలో ఉంది అన్న అంబేద్కర్ మాటలను కూడా కింద రాయించాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఓటర్లను ఆకర్షించి, మభ్యపెట్టేవారికి ఈ వాల్ రైటింగ్ చెంపపెట్టులాంటిదని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ వినూత్న ప్రచారం గ్రామస్తులు, యువతను, సోషల్ మీడియాలో పలువురిని అమితంగా ఆకర్షిస్తూ ఆలోచింపజేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories